Advertisement

Advertisement


Home > Movies - Movie News

నారద అనే పేరు ఎందుకొచ్చిందో నాకు తెలీదు

నారద అనే పేరు ఎందుకొచ్చిందో నాకు తెలీదు

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చిన మహేష్ విట్టా మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. తన అనుభవాల్ని పంచుకున్నాడు. అందరి గురించి కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడాడు. అయితే తనకు నారద అనే బిరుదు ఎందుకిచ్చారో అర్థంకావడం లేదంటున్నాడు మహేష్. తను మామూలుగానే ఉన్నానని, అందరితో కలిసిపోవడానికి ప్రయత్నించానని, కానీ తనకు నారద అనే బిరుదు ఎందుకిచ్చారో తెలియదంటున్నాడు.

"వీడు అందరితో తిరుగుతున్నాడు, అందరి గురించి తెలుసుకుంటున్నాడు అనే పుకారు వచ్చింది. అందుకే నాకు నారద అనే బిరుదు ఇచ్చేశారు. కానీ నేను మాత్రం ఎవ్వరి వైపు ఉండకుండా, ఎవ్వర్నీ సపోర్ట్ చేయకుండా ఉండేవాడ్ని. నేను సైలెంట్ కూర్చొన్నా కూడా నేనేదో ప్లానింగ్ చేస్తున్నానని అనేవారు. అంతలా నామీద నారద అనే ఇమేజ్ పడిపోయింది. నేను బయటకు వచ్చేవరకు అది అలానే ఉండిపోయింది."

ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేనంటున్నాడు మహేష్ విట్టా. ఓట్ల బట్టి చూస్తే రాహుల్,వరుణ్, శ్రీముఖికి ఎక్కువ అవకాశం ఉందంటున్నాడు. అయితే తను బాగా ఇష్టపడే బాబా భాస్కర్ పేరును మాత్రం మహేష్ చెప్పకపోవడం విచిత్రం. మరోవైపు శ్రీముఖితో జరిగిన గొడవపై కూడా రియాక్ట్ అయ్యాడు.

"టైటిల్ ఎవరికి వస్తుందనేది అప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఓట్లు అందరికీ సమానంగా పడుతున్నాయి. రాహుల్, వరుణ్, శ్రీముఖికి మంచి ఓట్లు పడుతున్నాయి కాబట్టి వీళ్లలో ఒకరు విన్నర్ కావొచ్చు. శ్రీముఖి వల్లనే నేను బయటకు వచ్చేశాననే వాదనలో నిజం లేదు. అసలు నా ఎలిమినేషన్ కు శ్రీముఖితో గొడవకు సంబంధం లేదు. నిజానికి రెండో వారం నుంచే శ్రీముఖితో నాకు గొడవ ఉంది. నేను చెప్పాలంటే శ్రీముఖి నెగెటివ్ పాయింట్స్ ను చాలా చెప్పగలను. హౌజ్ మేట్స్ కూడా నాతో అదే అన్నారు. కానీ నేను నా గేమ్ ఆడాలనుకున్నాను. అదే పనిచేశాను."

హౌజ్ నుంచి బయటకు వచ్చేయడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదంటున్నాడు మహేష్. ఎందుకంటే 4 వారాలు ఉంటే చాలనుకున్నానని, కానీ 12 వారాలు ఉండగలిగానని అంటున్నాడు. అదే తనకు పెద్ద సక్సెస్ అంటున్నాడు. 

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?