మహేష్…ఓపెన్ ఫైట్

ఖలేజా సినిమా ఆరంభంలో ఓ ఫైట్ వుంటుంది. ఇప్పటికీ మహేష్ అభిమానులకు గుర్తుండిపోయే ఓపెన్ ఎయిర్ ఫైట్ అది. త్రివిక్రమ్ ఆ మధ్య అరవింద సమేత సినిమాలో ఓ ఫైట్ చిత్రీకరించారు. మంది లేరా..కత్తుల్లేవా…

ఖలేజా సినిమా ఆరంభంలో ఓ ఫైట్ వుంటుంది. ఇప్పటికీ మహేష్ అభిమానులకు గుర్తుండిపోయే ఓపెన్ ఎయిర్ ఫైట్ అది. త్రివిక్రమ్ ఆ మధ్య అరవింద సమేత సినిమాలో ఓ ఫైట్ చిత్రీకరించారు. మంది లేరా..కత్తుల్లేవా అంటూ ఎన్టీఆర్ ఘర్జించే ఫైట్ అది. అది కూడా మెమరబుల్ నే. ఇప్పుడు ఈ రెండూ కలబోసిన రేంజ్ అన్నట్లుగా ఓ ఫైట్ ను మహేష్ కోసం ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్.

సినిమాలో మహేష్ కోసం ఓ ఓపెన్ ఎయిర్ మాస్ ఫైట్ ను ప్లాన్ చేసారని బోగట్టా. ఈ ఫైట్ తోనే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రోడ్ల మీద జరిగే ఫైట్ కావడంతో, రామోజీ ఫిలిం సిటీని లోకేషన్ గా ఎంచుకున్నారు. 

మహేష్ సినిమాల్లో ఇటీవల సరైన ఫైట్ గురించి చెప్పుకోవాలంటే సరిలేరు నీకెవ్వరు సినిమాలో ‘లోడెత్తాలిలా రమణా’ ఫైట్ నే మెమరబుల్. అంతకు ముందు దుర్గామహల్ ఫైట్. సర్కారువారిపాట సినిమాలో తాళాలు పట్టుకున్న ఫైట్ వాటి రేంజ్ కు వెళ్లలేదు.

ఇప్పుడు మళ్లీ తివిక్రమ్ సినిమా ఆ లోటు తీర్చబోతోంది. ఏప్రిల్ విడుదల టార్గెట్ గా ఈ సినిమాను ప్రారంభిస్తున్నారు. ఆ టైమ్ కు రెడీ అవుతుందా లేదా అన్నది కొంత వర్క్ అయితే తప్ప క్లారిటీ రాదు. ఎందుకంటే దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు వుంటాయి ఇండస్ట్రీలో కూడా. అవన్నీ తీసేస్తే ఆరు నెలల్లో ఇంత భారీ సినిమా తయారు కావడం అంటే కాస్త ఆలోచించాల్సిందే.