తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సారి బీజేపీ ప్రభుత్వపై, ప్రభుత్వ విధానాలపై విరుచుపడ్డారు. ఇవాళ బీహార్ టూర్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ బీజేపీపై తనదైనా శైలిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శించారు. గత ఎనిమిది సంవత్సరాలలో మోదీ సర్కార్ దేశానికి చేసిందేం లేదని, పైగా దేశంలో ప్రజల మధ్యలో విద్వేశం తీసుకువచ్చి దేశాన్ని నశనం చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.
ప్రదాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా అన్నారని, కానీ గాలి పటాలు ఎగరేసే మాంజా నుండి నెయిల్ కట్టర్ వరకు అన్ని కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నయని విమర్శించారు. రాజకీయ ప్రతీకారంతోనే బీజేపీయేతర రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
రోడ్డు, రైల్వేలు, ఎయిర్ పోర్టులు అన్నీ కేంద్ర సంస్ధలను అమ్మేస్తోందని, అన్ని అమ్మేసుకుంటు పోతే ఏం మిగుతుందని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గురిపించారు. ధర్మం పేరుతో దేశంలో వైషమ్మాలు తెస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలన్నారు.
కేసీఆర్ ఈ రోజు జాతీయ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరూ నాయకత్యం వహిస్తారనే దానిపై సృష్టత ఇవ్వలేదు. బహుశ కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై బీహార్ సీఎం నితిష్ సృష్టత ఇచ్చినట్లు లేదు. ప్రతిపక్షల అసమర్థత విధానలై బీజేపీ బలం అనేది రాజకీయ పరిశీలకులు అంటూన్నా మాటలు. ప్రతిపక్షాలు అందరూ ఏకదాటిపై వస్తే తప్పా బీజేపీని ఎదుర్కొన్నాలేరని సత్యం.