వైరల్: మహేష్ బాబు మాస్ లుక్!

మహేష్ బాబు గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ ఏజ్ రోజురోజుకు తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మహేష్ బాబు గ్లామ‌ర్ తో పాటు ఫిట్నెస్ కు కూడా ప్రాధాన్యత ఇస్తారు.  తాజాగా…

మహేష్ బాబు గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ ఏజ్ రోజురోజుకు తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మహేష్ బాబు గ్లామ‌ర్ తో పాటు ఫిట్నెస్ కు కూడా ప్రాధాన్యత ఇస్తారు.  తాజాగా త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ లో తెర‌కెక్కుతున్న SSMB28 సినిమా కోసం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు.

తాజాగా మ‌హేష్ బాబు తన ఇన్ స్టా లో జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో.. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. మహేష్ మాస్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

త్రివిక్రమ్ డైర‌క్ష‌న్ లో హారిక – హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సినిమా విషయానికి వస్తే… ఆల్రెడీ షూటింగ్ మొదలైంది.