Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహి సక్సెస్ రూట్.. ఓటిటి

మహి సక్సెస్ రూట్.. ఓటిటి

పాఠశాల సినిమా దగ్గర నుంచి, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాల వరకు అటు నిర్మాతగానో, ఇటు దర్శకుడిగానో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. కానీ ఓటిటి మాత్రం ఆయనకు భలే కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది.

రకరకాల జానర్ లను ట్రయ్ చేస్తూ ఓటిటి ప్లాట్ ఫారమ్ ల్లో సక్సెస్ లు కొడుతున్నారు. లేటెస్ట్ గా సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ను డిస్నీ హాట్ స్టార్ లో అందించారు. సీజన్ వన్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 2 ఆకట్టుకుంటోంది. అంతకు ముందు అదే ఓటిటి లో సైతాన్ వెబ్ సిరీస్ కూడా అందించారు.

ఆ విధంగా హ్యాట్ ట్రిక్ కొట్టినట్లు అయింది. తన త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూనే షో రన్నర్‌గానూ వెబ్ సిరీస్‌లను కూడా రూపొందిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి విజయాలను అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్ ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి ప్రయత్నిస్తాను. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు మహి.వి.రాఘవ్.

సేవ్ ది టైగర్స్ సీజన్ 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే, సీజన్ 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ సీజన్ 1 చాలా పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్ 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యాను. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం.

మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ షోలను రూపొందించటానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు మహి.వి.రాఘవ్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?