మళ్లీ బోయపాటి బాలయ్య కాంబో?

అఖండ సినిమా తరువాత బోయపాటి మళ్లీ ట్రాక్ లోకి వచ్చారని విపరీతంగా ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పటికిప్పుడు డేట్ లు ఇచ్చే హీరో మాత్రం కనిపించడం లేదు. పెద్ద హీరోలు అంతా ఇంకా…

అఖండ సినిమా తరువాత బోయపాటి మళ్లీ ట్రాక్ లోకి వచ్చారని విపరీతంగా ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పటికిప్పుడు డేట్ లు ఇచ్చే హీరో మాత్రం కనిపించడం లేదు. పెద్ద హీరోలు అంతా ఇంకా బోయపాటికి దూరంగానే వున్నారు. వినయ విధేయ రామ ఎఫెక్ట్ అంత సులువుగా పోదు. 

అలాగే అఖండ సినిమా ద్వితీయార్థం కేవలం బాలయ్య వల్ల, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ వల్ల తప్ప, కథలో ఇంటెన్సిటీ వల్ల సక్సెస్ కాలేదన్న భావన ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో బలంగా వుంది. అఖండ సినిమాలో బలమైన కథ లేదనే ఇప్పటికీ ఇండస్ట్రీ సర్కిళ్లు భావిస్తున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో అడ్వాన్స్ లు అయితే వస్తున్నాయి కానీ హీరోలు కాదు. సితార సంస్థ బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సెట్ చేయాలన్న ఆలోచన వుంది. కానీ అది ఇప్పట్లో జరుగుతుందా? అన్నది చూడాలి. మైత్రీ మూవీస్ తో ప్యాచప్ అయింది. కానీ దానికీ హీరో కావాలి. 

బోయపాటితో సినిమా చేయడానికి హీరో రామ్ ఆసక్తిగానే వున్నారని వార్తలు వున్నాయి. కానీ రామ్ ను కూడా స్క్రిప్ట్ తో ఒప్పించడం అంత సులువు కాదు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ బాలయ్యతోనే మరో ప్రాజెక్ట్ ను ఎన్నికల లోగా చేసే ఆలోచనలో బోయపాటి వున్నట్లు తెలుస్తోంది.  

ఈ ఏడాది చివరికి బాలయ్య రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చేసే ఆలోచనలో వున్నారు. ఆ వేళకు బోయపాటి ఏదో ఒక లైన్ తో రెడీ కావాల్సి వుంటుంది. బాలయ్య-బోయపాటి అయితే ఏదో సింహా, లెజెండ్, అఖండ ల మాదిరిగా మళ్లీ లైన్ వుంటే చాలు ఫైట్లు, డైలాగులతో పాస్ చేసేసుకోగలరు.