Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ మరో పోలీస్…స్టోరీ

మళ్లీ మరో పోలీస్…స్టోరీ

పోవీస్ కథ అంటే ఏముంటుంది. ఓ లక్ష్యం..ఆశయంతో పోలీస్ కావడం, విధి నిర్వహణలో ముక్కు సూటిగా సాగిపోవడం, అడ్డంకులు, అవరోధాలు, ఇరు వైపులా వార్నింగ్ లు..పంచ్ డైలాగులు..విధి నిర్వహణకు, కుటుంబ బాధ్యతలకు నడుమ నలిగిపోవడం అంతే కదా? అదే కథ మరోసారి మరో రూపంలో కనిపించింది హీరో శ్రీవిష్ణు అల్లూరి సినిమా ట్రయిలర్ గా. 

వైవిధ్యమైన కథలు ఎంచుకునే హీరో శ్రీవిష్ణు ఈసారి మాస్ కమర్షియల్ పోలీస్ కథ ఎంచుకున్నాడు. ఈ నెల మూడోవారంలో రాబోయే ఈ సినిమా ట్రయిలర్ విడుదల చేసారు. 

ట్రయిలర్ లో శ్రీవిష్ణు మాత్రమే కొత్తగా వున్నాడు. కంటెంట్ కాదు. ప్రతి పోలీస్ సినిమాలో చూసిన కంటెంట్ నే. అయితే క్లీన్ షేవ్, కోరమీసంతో శ్రీవిష్ణు కొత్తగా వున్నాడు. కథలో కాస్త విస్తారం ఎక్కువే వుందని ట్రయిలర్ లో కట్స్ చెబుతున్నాయి. మరి ఆ విస్తారమైన కథను, కమర్షియల్ యాంగిల్ లో ఎలా చెప్పాడన్నదాన్ని బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి వుంటుంది.

ఎప్పడూ వైవిధ్యమైన కథలు ఎంచుకునే శ్రీవిష్ణు ఈసారి ఈ కథ తీసుకున్నాడు అంటే ట్రయిలర్ కు మించి ఏదో వుందని అనుకోవాల్సి వుంది. అదేంటి అన్నది సినిమా చూస్తే తప్ప తెలియదు. లోహార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ల, సుమన్, పృధ్వీ, రాజా రవీంద్ర తదితరులు వున్నారు. కథ దర్శకత్వం ప్రదీప్ వర్మ.నిర్మాత బెక్కం వేణుగోపాల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?