మళ్లీ మరో ‘రీమిక్స్’ సినిమా!

కథలు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తాయి. చెప్పినవే కొత్తగా చెప్పాలి. అందులోనూ ఎప్పుడో చెప్పినవి, సరిగ్గా చెప్పలేకపోయినవి, జనం మరిచిపోయినవి వెదికి పట్టుకుంటే మన టాలెంట్ వాడి, కొత్త కథలను చేసుకోవచ్చు. ఇదో ఫార్ములా.…

కథలు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తాయి. చెప్పినవే కొత్తగా చెప్పాలి. అందులోనూ ఎప్పుడో చెప్పినవి, సరిగ్గా చెప్పలేకపోయినవి, జనం మరిచిపోయినవి వెదికి పట్టుకుంటే మన టాలెంట్ వాడి, కొత్త కథలను చేసుకోవచ్చు. ఇదో ఫార్ములా. కథల కోసం మరీ ఎక్కువ శ్రమపడకుండా. గతంలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా మరో సినిమా వస్తోందనే గ్యాసిప్ వినిపిస్తోంది. చాలా కాలం క్రితం ‘కొంచెం ఇష్టం ..కొంచెం కష్టం’ అనే సినిమా వచ్చింది. మంచి సినిమా అనిపించుకుంది. మంచి పాటలు కూడా ఈ సినిమాలో. కొన్ని చోట్ల బాగా ఆడింది. కొన్ని చోట్ల ఆడలేదు. ఈ సినిమాకు దర్శకుడు కిషోర్ కుమార్ పర్దాశాని. అలా అంటే తెలియకపోవచ్చు. డాలీ అని అంటే అందరికీ తెలిసిపోతుంది. 

పవన్ తో గోపాల గోపాల లాంటి సినిమా చేసిన దర్శకుడు. తరువాత కాటమరాయుడు కూడా చేసారు. చైతన్యతో తడాఖా అనే సినిమా చేసారు. అలాంటి డాలీ మొదటి సినిమా అది.

సిద్దార్ధ, తమన్నా..ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా లో కీలకమైన పాయింట్ ఏమిటంటే విడిపోయిన తల్లి తండ్రులను హీరో కలపడం. అలా కలిపితేనే అతగాడి ప్రేమను హీరోయిన్ తండ్రి ఓకె అంటాడు.

ఇప్పుడు ఇలాంటి పాయింట్ తో, ఇంచుమించు ఇదే కథకు కొత్త మెరుగులు అద్ది, కొత్తగా తయారుచేసి ఓ సినిమా తీసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ‘విడిపోయిన వారిని కలపడం’ అనేది ఎవర్ గ్రీన్ పాయింట్ కదా. కొంచెం ఇష్టం..కొంచెం కష్టంలో ఎందుకు విడిపోయారు అన్న దాని కన్నా కలపడం మీదనే దృష్టి వుంటుంది. కొత్త కథలో అసలు ఎందుకు విడిపోయారు. ఎవరు విడగొట్టారు అన్న పాయింట్ ట్విస్ట్ గా వుంటుంది.

కానీ క్రియేటర్లు తలుచుకుంటే కథలకు కొరత వుండదు. ఇప్పటికి వేల సినిమాలు వచ్చాయి. వాటిలో కోర్ పాయింట్ తీసుకుంటే కొత్త కథ అల్లుకోవచ్చు. రీమేక్ లకు వెళ్లనక్కరలేదు.