మళ్లీ మరోసారి..థాంక్యూ

విక్రమ్ కుమార్..నాగ్ చైతన్య కాంబినేషన్ లో తయారైన థాంక్యూ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. ‘మనం ఎక్కడ ప్రారంభమయ్యామో గుర్తు పెట్టుకోకపోతే, చేరిన గమ్యానికి అర్థం వుండదు’ అనే పాయింట్ తో తయారయింది…

విక్రమ్ కుమార్..నాగ్ చైతన్య కాంబినేషన్ లో తయారైన థాంక్యూ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. ‘మనం ఎక్కడ ప్రారంభమయ్యామో గుర్తు పెట్టుకోకపోతే, చేరిన గమ్యానికి అర్థం వుండదు’ అనే పాయింట్ తో తయారయింది ఈ సినిమా. 

జీవితంలో విజయాలు సాధించిన యువకుడు తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరినీ వెదుక్కుంటూ వెనక్కు వెళ్లి కృతజ్ఙతలు తెలియచేయడం. కాన్సెప్ట్, మేకంగ్ సంగతి అలా వుంచి ట్రయిలర్ ఎలా వుంది అన్నది చూస్తే…సీన్లు మరీ కొత్తగా అనిపించలేదు. గతంలో ఇలాంటి సీన్లు అన్నీ ఎక్కడో అక్కడ చూసిన ఫీలింగ్ నే. ప్రేమమ్ దగ్గర నుంచి చాలా చైతన్య సినిమాల వరకు.

విజవల్స్ గ్రాండ్ గా వున్నాయి. కలర్ ఫుల్ గా వున్నాయి. కానీ సమ్ థింగ్ న్యూ అన్నది మాత్రమే ఎక్కడో మిస్సయిన ఫీలింగ్. ఆ విషయం పక్కన పెడితే రెండు మూడు లుక్స్ లో చైతన్య బాగున్నాడు. థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. రాశీఖన్నా రెగ్యులర్ అనిపించింది. మొన్నే పక్కా కమర్షియల్ లో చూడడం వల్ల కావచ్చు.

ఈ నెల 22న సోలోగా విడుదలవుతున్న థాంక్యూ సినిమాకు నిర్మాతలు దిల్ రాజు-శిరీష్. గ్యాంగ్ లీడర్ తరువాత విక్రమ్ కుమార్, బంగార్రాజు తరువాత చైతన్య చేస్తున్న సినిమా ఇదే.