మెగా డాటర్ శ్రీజ కొణిదల ఈమధ్య కాలంలో తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఎప్పుడైతే తన పేరు పక్కన తన భర్త పేరును తొలగించిందో అప్పటినుంచి ఈమె కూడా సమంత బాటలోనే పయనం చేస్తుందని, సమంత మాదిరి విడాకులు తీసుకోబోతుందని వార్తలు వచ్చాయి.
ఇకపోతే వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ శ్రీజ కాని లేదా కళ్యాణ్ దేవ్ కానీ ఏమాత్రం స్పందించలేదు. అలాగే కళ్యాణ్ దేవ్ ను మెగా కుటుంబం పూర్తిగా పక్కన పెట్టేశారు.
మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి.
ఇలా వీరి విడాకుల గురించి రోజుకో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరొక వార్త తెరపైకి వచ్చింది. శ్రీజ తన భర్తకు అధికారకంగా విడాకులు ఇచ్చిందని అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదనే వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా శ్రీజ తన స్నేహితుడిని మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా వీరి గురించి వస్తున్న వార్తలపై మెగా కుటుంబం ఏమాత్రం ఖండించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు శ్రీజ మూడవ వివాహం గురించి మాట్లాడారు.
వ్యక్తిగత విషయాలను తెలియచేయడం పూర్తిగా తప్పు… ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ఒక అమ్మాయి లేదా సెలబ్రిటీ తన వృత్తిపరమైన విషయాల వరకు అభిమానులతో పంచుకోవచ్చు కానీ వ్యక్తిగత విషయాలను మాత్రం ఎప్పటికీ సోషల్ మీడియా ద్వారా తెలియ చేయకూడదు.
ఇది పూర్తిగా తప్పు. శ్రీజ కూడా ఇదే తప్పు చేయడం వల్ల ఆమె గురించి ఇలాంటి లేనిపోని వార్తలు వస్తున్నాయి. ఆమె తన భర్త పేరును తొలగించినంత మాత్రాన విడాకులు తీసుకుందని ఎలా ఫిక్స్ అవుతారు.
తన ఇష్టం ప్రకారం తన భర్త అనుమతితోనే తన భర్త పేరును తొలగించి తన ఇంటి పేరును పెట్టుకొని ఉండొచ్చని చిట్టిబాబు ఆ వార్తలను ఖండించారు. ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలుకు వారు సమాధానం చెప్పి ఖండించవచ్చు అనే ప్రశ్న ఎదురవగా, పని పాట లేని అడ్డమైన గాడిదలు ఏవేవో వార్తలు సృష్టిస్తూ ఉంటారు.
అలాంటి వారందరికీ సమాధానం చెప్పే అవసరం వారికి లేదంటూ ఈ సందర్భంగా నిర్మాత చిట్టి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.