మళ్లీ రేసుగుర్రం కాంబినేషన్

హీరో బన్నీ కెరీర్ లో రేసుగుర్రం ఓ మంచి హిట్ సినిమా. సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీ కలిసి బన్నీతో చేసిన సినిమా అది. మళ్లీ ఆ త్రయం కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారు. సైరా…

హీరో బన్నీ కెరీర్ లో రేసుగుర్రం ఓ మంచి హిట్ సినిమా. సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీ కలిసి బన్నీతో చేసిన సినిమా అది. మళ్లీ ఆ త్రయం కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారు. సైరా సినిమా తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి చేయబోయే ఫ్రాజెక్టు పని మొదలయింది. బన్నీ కోసం మాంచి కథ, మాంచి స్క్రిప్ట్ ను రెడీ చేసే పని ప్రారంభమయింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి కథను తయారుచేసే పనిలో వున్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అది పూర్తి కావడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుంది. ఆలోగా స్క్రిప్ట్ రెడీ చేసి, బన్నీ తో సినిమా చేయాలన్నది సురేందర్ రెడ్డి ఆలోచన. మళ్లీ రేసుగుర్రం మ్యాజిక్ ను రిపీట్ చేయాలని బన్నీ ప్లాన్. 

గీతా సంస్థనే ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికి అయితే బన్నీ ఫిక్స్ చేసుకున్న సినిమా ఇదొక్కటే అని తెలుస్తోంది. మురగదాస్ పేరు ఆ మధ్య వినిపించింది కానీ ప్రస్తుతానికి అది పక్కన పెట్టారని టాక్.

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..