‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్‌కి జాతీయ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు ఆ ఒక్క సినిమాకే పరిమితం కాదని ‘సాె’ నిరూపించింది. ఈ చిత్రం మిగిలిన భాషల్లో సరిగా ఆడకపోయినా కానీ హిందీ బెల్టులో ప్రభాస్ క్రేజ్‌ని చాటిచెప్పింది. దీంతో ప్రభాస్ తన సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా స్థిరపడడంపై దృష్టి పెడుతుంటే, మిగతా టాప్ తెలుగు స్టార్లు ఆ దిశగా వెళ్లే ఆలోచనలో లేనట్టున్నారు. మహేష్ హ్యాపీగా తెలుగు మార్కెట్‌ని మాత్రమే టార్గెట్ చేస్తోంటే, రాజమౌళితో ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తోన్న తారక్, చరణ్ కూడా ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా చిత్రాలు చేయాలని అనుకోవడం లేదు.
తారక్ ఇప్పటికే తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో అనౌన్స్ చేసేయగా, చరణ్ కూడా తదుపరి చిత్రం కొరటాల శివతో ఓకే చేసాడు. పవన్‌కళ్యాణ్‌తో క్రిష్ తీస్తోన్న చిత్రం పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయవచ్చు. సైరా అనుభవంతో ఇక చిరంజీవి అటు వెళ్లకపోవచ్చు. యువ హీరోల్లో విజయ్ దేవరకొండ మొదటి ప్రయత్నాన్ని పూరి సినిమాతో చేస్తున్నాడు. అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకురమ్మని తెలిసిన దర్శకులకి చెబుతున్నాడు.