మామా మశ్చీంద్ర..ఇంట్రస్టింగ్

సుధీర్ బాబు హీరోగా రచయిత..దర్శకుడు హర్షవర్ధన్ రూపొందిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. వైవిధ్యమైన కథతో తయారవుతోంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. …

సుధీర్ బాబు హీరోగా రచయిత..దర్శకుడు హర్షవర్ధన్ రూపొందిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. వైవిధ్యమైన కథతో తయారవుతోంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. 

హర్ష కు కామెడీ టైమింగ్, రైటింగ్ రెండూ వున్నాయి. ఆ టచ్ ఈ టీజర్ లో పక్కాగా కనిపిస్తోంది. ఆ మధ్యన వచ్చిన కళ్యాణ్ రామ్ అమిగోస్ మాదిరిగా ఈ సినిమాలో కూడా సుధీర్ బాబు మూడు క్యారెక్టర్లలో కనిపిస్తున్నాడు. వాటిలో ఒకటి ఎక్స్ ట్రీమ్ విలనిజం..ఒకట ఫన్ తో వున్నాయి.

సుధీర్ బాబు తన క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాడు. ఈ సినిమాలో కూడా అదే చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ గతంలో రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ చేసినట్లు కాస్త ఊబకాయంతో వుంది. ఫ్యామిలీ ప్యాక్ వుంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడనే సెటైర్ డైలాగ్ కూడా పెట్టారు ఈ పాత్రకు.

విలన్ పాత్రకు బలమైన, బరువైన డైలాగ్ నే వేసారు. దేవతలే అవసరం అయితే రాక్షసులు కాగా లేనింది, హీరో విలన్ అయితే ఏంటీ అనేమో? మొత్తం మీద టీజర్ అయితే ఇంట్రస్టింగ్ గా కట్ చేసారు. ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మిస్తున్నారు.