మామా మశ్చీంద్ర.. మరో ముగ్గురు వస్తున్నారు!

ఈమధ్య అమిగోస్ వచ్చింది, కల్యాణ్ రామ్ ను 3 గెటప్స్ లో చూశాం. ఇప్పుడు సుధీర్ బాబును 3 గెటప్స్ లో చూడబోతున్నాం. మామా మశ్చీంద్ర సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. స్టోరీ ఎలా…

ఈమధ్య అమిగోస్ వచ్చింది, కల్యాణ్ రామ్ ను 3 గెటప్స్ లో చూశాం. ఇప్పుడు సుధీర్ బాబును 3 గెటప్స్ లో చూడబోతున్నాం. మామా మశ్చీంద్ర సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. స్టోరీ ఎలా ఉండబోతోందనే విషయంపై ఎలాంటి హింట్ ఇవ్వకుండా టీజర్ కట్ చేశారు.

సుధీర్ బాబు గెటప్స్ ను, క్యారెక్టర్స్ ను పరిచయం చేయడం కోసమే టీజర్ ను పరిమితం చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు గెటప్స్ కు సంబంధించి లుక్స్ ఆల్రెడీ రివీల్ చేశారు. ఇప్పుడా లుక్స్ తో టీజర్ ను కట్ చేశారు.

ఈ సినిమాలో డీజే, పరశురామ్, దుర్గ అనే 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు. ఆ పాత్రలన్నింటినీ టీజర్ లో చూపించారు. వీటిలో 2 పాత్రల్ని, మూడో పాత్ర చంపాలనుకుంటోందనే విషయాన్ని కూడా చూపించారు.

ఇప్పటికే పలువురు హీరోలు తెలంగాణ, రాయలసీమ యాసలో మాట్లాడుతూ కొన్ని సినిమాలు చేశారు. ఇందులో సుధీర్ బాబు పాత్ర ఒకటి శ్రీకాకుళం యాసలో మాట్లాడుతుంది.

హీరోయిన్లు మృణాళిని రవి, ఈషా రెబ్బాకు కూడా టీజర్ లో చోటిచ్చారు. అంతేకాదు, మూవీని డైరక్టర్ చేసిన హర్షవర్థన్ కూడా సినిమాలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను తెలుగు-హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.