ఒకే ఊరిలో రెండు కాపురాలు పెట్టాడు

చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నానని రావడానికి ఓ 10 రోజులు పడుతుందని భర్త, భార్యతో చెబుతాడు. వెంటనే చిన్నిల్లుకు చేరుకుంటాడు. అలా రెండు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇక్కడ…

చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నానని రావడానికి ఓ 10 రోజులు పడుతుందని భర్త, భార్యతో చెబుతాడు. వెంటనే చిన్నిల్లుకు చేరుకుంటాడు. అలా రెండు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇక్కడ మాత్రం ఈ దుర్మార్గుడికి మరో ఊరు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఒకే ఊరులో 2 కాపురాలు పెట్టాడు. విషయం బయటపడ్డంతో రెండో భార్యను వదిలేశాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.

గుంటూరుకు చెందిన షబీనా చదువుకోవడం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈసీఐఎల్ లో ఉండేది. ఓ స్నేహితురాలి ద్వారా ఆమెకు సంపత్ పరిచయమయ్యాడు. తక్కువ టైమ్ లోనే ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. దీంతో ఓ రోజు పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే సంపత్ కు అప్పటికే పెళ్లయి ఓ పాప కూడా ఉంది. ఈ విషయాన్ని అతడు దాచాడు. మొదటి భార్య వనస్థలిపురంలో ఉండగా.. కొత్తగా పెళ్లి చేసుకున్న షబీనాను సికింద్రాబాద్ పరిథిలో ఉన్న ఆవులమందలో ఉంచాడు. నైట్ డ్యూటీ ఉందని చెప్పి మొదటి భార్య ఇంటికి వెళ్లేవాడు. ఇంకొన్ని రోజులు నైట్ డ్యూటీ అని చెప్పి రెండో భార్య ఇంట్లో కాపురం చేసేవాడు.

అయితే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ రోజులు నిలవవు. సంపత్ చేసిన పని బయటపడింది. దీంతో మొదటి భార్య, ఆమె సోదరుడితో కలిసి భర్తతో గొడవ పెట్టుకుంది. దీంతో సంపత్, మొదటి భార్యకే పరిమితమైపోయాడు. షబీనాను వదిలేశాడు.

షబీనా అప్పటికే గర్భవతి. భర్త రాక కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఈనెల 9న కోఠి హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ప్రస్తుతం ఓ చిన్న ఇంటిలో ఉంటున్న షబీనా పోలీసులపైనే నమ్మకం పెట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మిమ్మల్ని యాంకర్ గా తీసెయ్యాలి