మన నిర్మాత-దర్శకుల పక్క చూపులు

టాలీవుడ్ ఫుల్ జోష్ మీద వుంది. నిర్మాతలు చకచకా సినిమాలు చేస్తున్నారు. అయితే చిన్న మార్పు ఏమిటంటే, చిన్న చిన్న సినిమాలు పనిచేయవని అర్థం అయింది.  Advertisement సినిమాకు ఓ రేంజ్ వుంటేనే జనం…

టాలీవుడ్ ఫుల్ జోష్ మీద వుంది. నిర్మాతలు చకచకా సినిమాలు చేస్తున్నారు. అయితే చిన్న మార్పు ఏమిటంటే, చిన్న చిన్న సినిమాలు పనిచేయవని అర్థం అయింది. 

సినిమాకు ఓ రేంజ్ వుంటేనే జనం థియేటర్లకు వస్తున్నారు. కానీ అలా రేంజ్ వున్న సినిమాలు చేయాలంటే ఓ రేంజ్ వున్న హీరోలే అందరికీ కావాలి. తెలుగు హీరోలు ఎంత మంది వున్నా సరిపోవడం లేదు. అందుకే తమిళ, మలయాళ ఇండస్ట్రీల వైపు చూస్తున్నారు.

ఇప్పటికే ధనుష్. దుల్కర్, శివకార్తికేయన్, ఆర్య లాంటి వాళ్లు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేసారు. ప్రస్తుతం అరడజను వరకు అదర్ లాంగ్వేజ్ హీరోలతో తెలుగు దర్శక నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. 

కార్తీ హీరోగా 14 రీల్స్ పతాకంపై పరుశురామ్ తో ఓ సినిమా ఓకె అయింది. నవంబర్ నుంచి షూట్ వుండోచ్చు.  తమిళ హీరో సూర్యతో గీతా సంస్థ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ అంతా రెడీ అయింది.

దుల్కర్ సల్మాన్ హీరోగా స్టాక్ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు వెంకీ అట్లూరి ఓ సినిమా చేసుకున్నారు. సితార సంస్థ నిర్మాత. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆసియన్ సునీల్ ఓ మల్టీ స్టారర్ త్వరలో ప్రారంభించబోతున్నారు. నిర్మాత దిల్ రాజు తమిళ సూపర్ స్టార్ రజనీతో ఓ సినిమా ఓకె చేయించుకున్నారు. బాబీ దర్శకుడు.

ఇవి కాక మరి కొందరు హీరోలతో కూడా దర్శకులు టచ్ లో వున్నారు. మొత్తం మీద సౌత్ ఇండియా ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా మారేలా కనిపిస్తోంది భవిష్యత్ లో.