వైసీపీ నేతలతో మాజీ మంత్రి కొణతాల

విశాఖ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు,  ప్రస్తుతం రాజకీయంగా అంత చురుకుగా లేరు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతోంది, పార్టీ ఏది అన్నది మాత్రం క్లారిటీ లేదు. Advertisement…

విశాఖ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు,  ప్రస్తుతం రాజకీయంగా అంత చురుకుగా లేరు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతోంది, పార్టీ ఏది అన్నది మాత్రం క్లారిటీ లేదు.

అసలు కొణతాల రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ లోనే గడచింది. వైఎస్సార్ మరణాంతరం ఆయన వైసీపీలో చేరారు. ఆ మీదట ఆయన దాని నుంచి బయటపడి తెలుగుదేశంలో చేరారు. కానీ 2009 తరువాత ఆయన రాజకీయం కళ కట్టడంలేదు.

కొణతాలకు రాజకీయంగా మిత్రులు ప్రత్యర్ధులు ఉన్నారు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని వేదికల మీద వారూ వీరూ కలుసుకోవడం పరిపాటి. సగటు జనాలకు మాత్రం ఆది ఆసక్తిని రేకెత్తించే అంశం అవుతుంది. కొణతాల వైసీపీ బీసీ నేత పక్కి దివాకర్ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం వైజాగ్ వచ్చారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో వైసీపీ నేతలు అంతా ఉన్నారు. వారి మధ్యనే కొణతాల కూడా కనిపించారు.

అనకాపల్లి రాజకీయాల్లో కొణతాలతో దశాబ్దాల వైరాన్ని కొనసాగించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అక్కడ ఉండడం విశేషం. అలాగే వైసీపీలో గతంలో కొణతాలతో పనిచేసిన నేతలతోనూ ఆయన ముచ్చటించారు. కొణతాల మళ్లీ వైసీపీ వైపు వస్తారా అన్న ప్రచారం కూడా ఉంది. ఆయన రాజకీయంగా గట్టి నేత అయినప్పటికీ సరైన  రాజకీయ వేదిక కుదరడం లేదు అని అంటున్నారు. వైసీపీ నేతలతో చాలా కాలం తరువాత ఈ సీనియర్ నేత కలసిమెలసి ఉండడం అనేక రకాల ఊహాగానాలకు దారి తీస్తోంది.