మంచు మనోజ్ తండ్రి అయ్యాడు. భూమా మౌనిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా ప్రకటించింది. తన తమ్ముడు మంచు మనోజ్ తండ్రి అయ్యాడని, మౌనిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని ప్రకటించింది.
కొన్నాళ్ల కిందట భూమా మౌనికా రెడ్డిని పెళ్లాడాడు మంచు మనోజ్. అన్నీ తానై మంచు లక్ష్మి ఈ వివాహం జరిపించారు. అప్పటికే కుటుంబంలో కొన్ని అభిప్రాయబేధాలున్నప్పటికీ, అంతా ఆ పెళ్లికి తరలివచ్చారు.
అలా పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, మౌనిక.. కొన్నాళ్లకు తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయాన్ని వెల్లడించారు. అదే టైమ్ లో మౌనిక బేబీ బంప్ తో ఉన్న ఫొటోల్ని కూడా మంచు మనోజ్ షేర్ చేశాడు. ఇప్పుడామె ఆడ పిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన పాపకు ముద్దుగా ఎంఎం పులి అనే ముద్దుపేరు పెట్టుకున్నారు మంచు కుటుంబ సభ్యులు.
మౌనికకు ఆల్రెడీ ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మంచు మనోజ్ ద్వారా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత మంచు మనోజ్ కెరీర్ పరంగా బిజీ అయ్యాడు. ఓటీటీలో షో చేస్తున్నాడు. ఓ సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి అయి, ఫ్యామిలీ లైఫ్ లో కూడా బిజీ కానున్నాడు.