Advertisement

Advertisement


Home > Movies - Movie News

కలిసొచ్చిన కాలం.. డబ్బింగ్ సినిమాకు వరం

కలిసొచ్చిన కాలం.. డబ్బింగ్ సినిమాకు వరం

సాధారణంగా డబ్బింగ్ సినిమాలకు మంచి టైమ్ అంటూ దొరకదు. ఇక చిన్న డబ్బింగ్ సినిమాలైతే.. గుంపులో గోవిందయ్యలా రిలీజ్ అయిపోతుంటాయి. ఇలా వచ్చి అలా పోతుంటాయి. ఈ క్రమంలో కొన్ని మంచి సినిమాలు కూడా కొట్టుకుపోతుంటాయి.

మంజుమ్మల్ బాయ్స్ కు ఆ గతి పట్టలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన ఈ సినిమా సరైన టైమ్ లో తెలుగులో రిలీజ్ అయింది. ఓవైపు హాలిడేస్ నడుస్తున్నాయి. మరోవైపు థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. పెద్ద సినిమాల్లేవ్. టిల్లూ స్క్వేర్ వచ్చి వారం దాటింది. ఫ్యామిలీ స్టార్ సంగతి అందరికీ తెలిసిందే.

ఇలాంటి టైమ్ లో వచ్చింది మంజుమ్మల్ బాయ్స్. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమా ఆల్రెడీ పెద్ద హిట్టు. 200 కోట్ల వసూళ్లు సాధించి మల్లూవుడ్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అదే ఊపులో ఈరోజు తెలుగులోకి వచ్చింది.

ఈ సినిమా ఎప్పుడు తెలుగులోకి వస్తుందా, చూద్దామని ఓ బ్యాచ్ తహతహలాడింది. ఆ తహతహలకు తగ్గట్టే సినిమాకు తెలుగులో పాజిటివ్ టాక్ మొదలైంది. ఈ టాక్ ఇంకాస్త గట్టిగా వినిపిస్తే, తెలుగులో కూడా మంజుమ్మల్ బాయ్స్ సంచలనం సృష్టించడం ఖాయం.

ఇప్పుడిప్పుడే మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ విషయంలో తమిళ డబ్బింగ్ చిత్రాల స్థానాన్ని మలయాళం సినిమాలు ఆక్రమించినట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన ప్రేమలు సినిమా మల్టీప్లెక్సుల్లో పెద్ద హిట్టయింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న పరిస్థితులు అనుకూలించి, మంజుమ్మల్ బాయ్స్ కు మౌత్ టాక్ పెరిగితే, తెలుగులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మలయాళ చిత్రంగా ఇక్కడ కూడా ఇది రికార్డ్ సృష్టిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?