సూపర్ హిట్ మన్మధుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది అన్షు. ఆ తర్వాత కొన్ని సినిమాలకే ఆమె ఫేడవుట్ అయింది. ఆ సినిమాలో మహి పాత్రలో అన్షు లుక్స్, నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ ఇప్పటికీ చాలామందికి గుర్తే.
సినిమా వచ్చి 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ టీవీల్లో మన్మధుడు సినిమా వస్తే అలా అతుక్కుపోయే జనం చాలామంది. మరి ఇప్పుడీ ముద్దుగుమ్మ ఎక్కడుంది? ఏం చేస్తోంది?
అన్షు చాలా తొందరగానే పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి లండన్ లో స్థిరపడిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ లో తన ఫ్రెండ్స్ ను కలుస్తోంది.
ఈ సందర్భంగా అన్షు ఫ్రెండ్ ఏర్పాటు చేసిన పార్టీకి నాగార్జున సతీసమేతంగా వచ్చారు. లాంగ్ గ్యాప్ తర్వాత అన్షును కలిసి ఆశ్చర్యపోయారు. అప్పటి జ్ఞాపకాల్ని ఇద్దరూ నెమరువేసుకున్నారు.
మన్మధుడు సినిమాలో అభి పాత్ర పోషించారు నాగ్. అలా అభి-మహి రియల్ లైఫ్ లో కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. మన్మధుడు సినిమా నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్లయినా అన్షు అలానే ఉంది.