మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. మార్చి 3న పెళ్లి చేసుకోబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డితో జరిగే వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక రెడ్డి కి గతంలో పెళ్లి జరిగి విఫలమైంది. మనోజ్ కు కూడా పెళ్లి జరిగి, విడాకులకు దారితీసింది.
గత కొంతకాలంగా మనోజ్ పెళ్లి అన్నది వార్తల్లోనే వుంటూ వస్తోంది. మనోజ్-మౌనిక కలిసి చాలా సార్లు కనిపించారు. త్వరలో శుభవార్త అనే హింట్ లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆఖరికి అదే ఫిక్స్ అయింది. 3న పెళ్లి వుందని తెలస్తోంది కానీ ఎక్కడ, ఎలా, ఎవరెవరు వస్తారు? లేదా సింపుల్ గా చేసుకుంటారా? అన్న వివరాలు ఇంకా తెలియలేదు.
మంచు మనోజ్ కొన్ని సినిమాలు చేసారు. కానీ చిరకాలంగా సినిమాలు ఏవీ చేయలేదు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా స్టార్ట్ చేసారు కానీ ఆగిపోయింది. ఆ సినిమా డైరక్టర్ వేరే ప్రాజెక్ట్ మీదకు కూడా వెళ్లిపోయారు.
తెలంగాణలో ఏదో టూరిజం ప్రాజెక్ట్ మీద కూడా మనోజ్ కొంత వర్క్ చేసారు. కానీ అదీ ముందుకు సాగినట్లు లేదు.