Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరో మహిళా దర్శకురాలు

మరో మహిళా దర్శకురాలు

తెలుగునాట మహిళా దర్శకులు తక్కువ. సినిమాకు సంబంధించిన అన్ని రంగాల్లో మహిళలు ఫుల్ జోష్ తో ఇన్వాల్స్ అయి పని చేస్తున్నారు కానీ దర్శకులు కావడం తక్కువ. అప్పట్లో విజయనిర్మల, ప్రస్తుతానికి నందినీ రెడ్డి పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి.ఈ మధ్యలో మరి కొందరు కొన్ని సినిమాలు అయితే చేసారు. 

కానీ ఓ రేంజ్ వరకు చేరుకోలేదు. హీరో నాని సోదరి కూడా ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ చేసారు. అనుకున్నంత పేరు రాలేదు. వచ్చి వుంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా చేసి వుండేవారేమో? అది వేరే సంగతి.

ఇప్పుడు మరో మహిళ టాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకోబోతున్నారు. ఈమె ఇప్పటికే టాలీవుడ్ తో మాంచి రిలేషన్స్ తో వున్నారు. నేరుగా వెళ్లి చాలా మందికి కథ చెప్పగలరు. ఆమె ఎవరో కాదు నీరజ కోన. రచయిత, నిర్మాత, దర్శకుడు ఇంకా చాలా చాలా అయన కోన వెంకట్ కు దగ్గర బంధువు. ఈమె చాలా మంది హీరోయిన్ లకు పర్సనల్ డిజైనర్ కూడా. ఇప్పుడు ఆ జాబ్ వదిలి మెగా ఫోన్ పట్టబోతున్నారు.

సిద్దు జొన్నలగడ్డ కోసం ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విత్ థ్రిల్లింగ్ టచ్ తో కథ రాసుకున్నారు. ఈ సబ్జెక్ట్ ను సిద్దూ ఓకే చేసారు కూడా. త్వరలో పట్టాలు ఎక్కుతుంది. మాంచి మ్యాచింగ్ హీరోయిన్ కోసం చూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫుల్ స్వింగ్ లో మొదలైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?