మరోసారి మాస్ గా మారబోతున్న మెగా హీరో

మాస్ మసాలాస్, మాస్ లుక్స్ ట్రై చేసిన ప్రతిసారి ఫ్లాపులు చూశాడు సాయితేజ్. ఎప్పుడైతే చిత్రలహరి లాంటి సబ్జెక్ట్ చేశాడో అప్పుడే సక్సెస్ లోకి వచ్చాడు. తాజాగా ప్రతిరోజూ పండగే లాంటి ఫ్యామిలీ ఎంటర్…

మాస్ మసాలాస్, మాస్ లుక్స్ ట్రై చేసిన ప్రతిసారి ఫ్లాపులు చూశాడు సాయితేజ్. ఎప్పుడైతే చిత్రలహరి లాంటి సబ్జెక్ట్ చేశాడో అప్పుడే సక్సెస్ లోకి వచ్చాడు. తాజాగా ప్రతిరోజూ పండగే లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు విజయాలు అందుకున్న సాయితేజ్, ఇప్పుడ మరోసారి మాస్ సబ్జెక్ట్ ట్రై చేయడానికి రెడీ అవుతున్నాడు.

దేవ్ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సాయితేజ్. కంప్లీట్ మాస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రాబోతోంది. భగవాన్-పుల్లారావ్ నిర్మించనున్న ఈ సినిమాను మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఇతడు పక్కా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. కాకపోతే సబ్జెక్ట్ మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది.

ప్రస్తుతం ఈ హీరో, సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే దేవ్ కట్టా దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వస్తుంది. చాన్నాళ్లుగా తెలుగు తెరపై కనిపించలేదు దేవ్ కట్టా. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రస్థానం లాంటి సినిమా తీసిన ఈ దర్శకుడు.. తర్వాత సక్సెస్ అవ్వలేకపోయాడు.

రీసెంట్ గా ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేశాడు దేవ్ కట్టా. దీంతో పాటు నెట్ ఫ్లిక్స్ కు చేయాల్సిన ఓ వెబ్ సిరీస్ ను కూడా పూర్తిచేశాడు. ప్రస్తుతం సాయితేజ్ సినిమాపైనే పూర్తిగా ఫోకస్ పెట్టిన దేవ కట్టా.. ఈ మూవీతో టాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.