రెండో రోజు కోటి లోపే.. ‘రూల్’ చేయలేకపోయాడు

మొదటి రోజు రూలర్ సినిమాకు 4 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంతకంటే ఎక్కువగా డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో రెండో రోజు ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే 24…

మొదటి రోజు రూలర్ సినిమాకు 4 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంతకంటే ఎక్కువగా డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో రెండో రోజు ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే 24 గంటల్లోనే ఆక్యుపెన్సీ 60 శాతానికి పైగా పడిపోయింది. ఫలితంగా రెండో రోజు రూలర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 92 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 21 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. రెండో రోజు వసూళ్లతో కంపేర్ చేసి చూసుకుంటే.. రూలర్ బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమనే విషయం అర్థమౌతూనే ఉంది. పాతికేళ్ల కిందటి కథ, అదే స్క్రీన్ ప్లే, రొటీన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా, రేపట్నుంచి ఇక రేస్ లో ఉండదు. ఈ సినిమాతో 2019లో బాలయ్య ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టినట్టయింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాను రిలీజ్ చేశాడు బాలయ్య. అది కాస్తా డిజాస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత మినిమం గ్యాప్ లో మహానాయకుడు సినిమాను విడుదల చేశారు. కథానాయకుడే బెటర్ అనిపించేలా ఉంది మహానాయకుడు.

ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత గ్యాప్ తీసుకొని రూలర్ చేశాడు. ఇది కూడా డిజాస్టర్ అవ్వడంతో, ఈ ఏడాది బాలయ్య కెరీర్ లో బ్లాక్ మార్క్ గా నిలిచిపోయింది. ఇక ఆశలన్నీ బోయపాటి సినిమాపైనే.