మారుతికి రెడ్ కార్పెట్

సినిమా మంచి చెడ్డలు, బాగోగులు ఇప్పుడే చెప్పలేం కానీ ముందు అసలు విడుదలకు అన్నీ మంచి శకునములే అన్నట్లు వుంటే అదో ఆనందం. దర్శకుడు మారుతి-గోపీచంద్ సినిమాకు ఇలాంటి మంచి శకునాలు కనిపిస్తున్నాయి.  Advertisement…

సినిమా మంచి చెడ్డలు, బాగోగులు ఇప్పుడే చెప్పలేం కానీ ముందు అసలు విడుదలకు అన్నీ మంచి శకునములే అన్నట్లు వుంటే అదో ఆనందం. దర్శకుడు మారుతి-గోపీచంద్ సినిమాకు ఇలాంటి మంచి శకునాలు కనిపిస్తున్నాయి. 

అన్ని సినిమాలు అయిపోయాక ప్రశాంతంగా విడుదల చేద్దాం అనుకున్నారు. జూలై 1 విడుదల అని డేట్ పెట్టుకుని కూర్చున్నారు. కానీ అదే డేట్ కు మూడు నాలుగు సినిమాలు టప టపా డేట్ లు పడ్డాయి. దాంతో కాస్త టెన్షన్ పడ్డారు.

కానీ గమ్మత్తుగా ఒక్కో సినిమా పక్కకు తప్పుకున్నాయి. ఇప్పుడు సోలో విడుదల గా మిగిలింది. దానికి ముందు వారం బలమైన సినిమా వుంటుందేమో? అనుకున్నారు. కానీ 24న చిన్న చిన్న సినిమాలు గంపగుత్తగా వస్తున్నాయి. దాంతో అక్కడ కూడా లైన్ క్లియర్. 

ఎఫ్ 3 తరవాత అంటే సుందరానికి వస్తోంది. అదీ ఫన్ జానర్ నే. రెండు ఫన్ జానర్ ల తరువాత పక్కా కమర్షియల్ కూడా అదే తరహా సినిమా అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నారు. కానీ అంటే సుందరానికి ఎమోషన్ కంటెంట్ ఎక్కువయింది. లెంగ్త్ ఎక్కువయింది అన్న టాక్ వచ్చింది.

ఆ తరువాత వస్తున్న విరాటపర్వం పూర్తిగా అర్బన్ సినిమా. సీరియస్ సినిమా. అంటే ఇరవై రోజుల సీరియస్ గ్యాప్ తరువాత పక్కా కమర్షియల్ వస్తోంది. అందువల్ల అన్నీ బాగున్నాయి. 

ఇక బాగుండాల్సింది సినిమానే. ఈ రోజు ట్రయిలర్ విడుదలవుతోంది. ట్రయిలర్ కూడా ఆకట్టుకుని, ఒకటి రెండు మంచి పాటలు పడితే ఓపెనింగ్స్ వుంటాయి. ఆపై కంటెంట్ బాగుంటే గీతా సంస్థ..మారుతి…బన్నీవాస్..గోపీచంద్..ఇలా అందరూ హ్యాపీనే.