Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒకప్పుడు అరటిపళ్లు అమ్ముకునేవాడ్ని

ఒకప్పుడు అరటిపళ్లు అమ్ముకునేవాడ్ని

తన గత జీవితం గురించి, అప్పట్లో పడిన బాధల గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం మొహమాటపడడు దర్శకుడు మారుతి. చాలామందికి అతడు గ్రాఫిక్ డిజైనర్ గా మాత్రమే తెలుసు. కానీ ఒకానొక టైమ్ లో తను బండిపై అరటిపళ్లు అమ్ముకున్నానని, ఆఫీస్ బాయ్ గా కూడా పనిచేశానని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు.

"ఇంట్లో నేను మెషీన్ కుట్టేవాడిని. ఎంబ్రాయిడరీ లాంటి పనులు చేయడంతో పాటు చిరిగిపోయిన దుస్తులన్నీ కుట్టేవాడ్ని. మరోవైపు మా నాన్నతో కలిసి అరటిపళ్లు అమ్మేవాడ్ని. ఆ తర్వాత ఓ ఆఫీస్ లో అసిస్టెంట్ గా కూడా చేరాను. టీలు, జిరాక్స్ కాపీలు అందించడం చేసేవాడ్ని. తర్వాత ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా పనిచేశాను."

ఇలా బతుకుతెరువు కోసం తను చేసిన పనులన్నీ ఏకరవు పెట్టాడు మారుతి. తనకు కష్టం విలువ తెలుసని, మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో పరిస్థితులు తెలుసని చెబుతున్న ఈ దర్శకుడు.. అవకాశాలు ఉన్నా లేకున్నా ఏదో ఒకటి చేయడం తనకు అలవాటంటున్నాడు. మరోవైపు వర్మ తీస్తున్న "అల్లు" అనే సినిమాపై కూడా స్పందించాడు. అల్లు అరవింద్ కు అత్యంత దగ్గరగా ఉండే మారుతి, అల్లు సినిమాపై తనదైన శైలిలో స్పందించాడు.

"ఆయన (వర్మ) ఉద్దేశం ఆయన చెప్పాలనుకుంటున్నాడు. కాకపోతే అది అవతలి వ్యక్తి (అల్లు అరవింద్) ని హర్ట్ చేయకుండా ఉండాలి. ఎవరైనా ఇలానే అనుకుంటారు. కానీ నేను హర్ట్ చేసి సినిమా చేస్తానంటే అది ఆయన (ఆర్జీవీ) ఇష్టం. దాని వల్ల హర్ట్ అయిన వ్యక్తి (అల్లు అరవింద్) ఎలా రియాక్ట్ అవుతాడు, ఆ పరిణామాలేంటనేది కూడా వర్మ ఆలోచించుకోవాల్సి ఉంటుంది."

కరోనా ఇలానే కొనసాగితే మాత్రం తనకుతానుగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానంటున్నాడు మారుతి. ఏది ఏమైనా అక్టోబర్ నుంచి బిజీగా ఉండాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో 4 కథలు రాసుకున్నాడట ఈ డైరక్టర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?