ఏ తెలుగు యంగ్ హీరోని అయినా ఒప్పించాలి అంటే మాస్ మాస్ కథ చెబితే పనైపోతుంది. పోలీస్ పాత్ర, ఫుల్ ఫైట్లు వున్న పాత్ర అంటే మహా మోజు మన కుర్ర హీరోలు అందరికీ.
అయినా జనం మాత్రం యంగ్ హీరోలు ఎవ్వరు మాస్ సినిమా చేసినా కిలో మీటర్ దూరం పెడుతున్నారు. అయినా మాస్ సినిమా అంటే చాలు మన హీరోలకు మహా మోజు.
లేటెస్ట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా మాస్ బాట పడుతున్నాడు. ఉప్పెన సినిమా తరువాత చేసిన సినిమా కలిసి రాలేదు. మరో సినిమా సెట్ మీద వుంది. ఇప్పుడు ఓ మాస్ సినిమాను ఎంచుకుని ప్రారంభించబోతున్నాడు.
శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు చెప్పిన అవుట్ అండ్ అవుట్ మాస్ కథను తీసుకుని సితార బ్యానర్ మీద నాగవంశీ, సాయి సౌజన్య (త్రివిక్రమ్ భార్య) కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వైష్ణవ్ సోదరుడు సాయి ధరమ్ మాస్ సినిమా చేసిన ప్రతిసారీ ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు. మరి ఈసారి వైష్ణవ్ కు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.