మాట తప్పిన రామ్ చరణ్

సైరా టైమ్ లో ముచ్చట ఇది. ఇకపై తమ సినిమాలకు కలెక్షన్ల అంకెలు ప్రకటించను అని హీరో రామ చరణ్ ఓ విప్లవాత్మక నిర్ణయం ప్రకటించారు. అందరూ శహభాష్ అన్నారు.  Advertisement అలవాటైన షేర్…

సైరా టైమ్ లో ముచ్చట ఇది. ఇకపై తమ సినిమాలకు కలెక్షన్ల అంకెలు ప్రకటించను అని హీరో రామ చరణ్ ఓ విప్లవాత్మక నిర్ణయం ప్రకటించారు. అందరూ శహభాష్ అన్నారు. 

అలవాటైన షేర్ ఫిగర్ చెప్పకుండా పెద్ద పెద్ద అంకెల గ్రాస్ ఫిగర్లు ప్రకటించడం టాలీవుడ్ పెద్ద సినిమాల అలవాటు అవుతున్నపుడు, ఫేక్ ఫిగర్లు అంటూ యాంటీ ఫ్యాన్స్ వైపు నుంచి గడబిడ వస్తున్నపుడు ఇక పోస్టర్లు వేసి ప్రయోజనం ఏమిటి అని అంతా అనుకుంటున్నపుడు రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది.

అదే టైమ్ లో దర్శకుడు త్రివిక్రమ్ మెగాస్టార్ చిరు ను ప్రమోషనల్ ఇంటర్వూ చేసారు. అందులో త్రివిక్రమ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దానికి చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతూ సమాధానం ఇచ్చారు. రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ఎంత పరిణితితో కూడుకున్నది అంటూ పొగిడారు.

కట్ చేస్తే..

ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాకు అవన్నీ మరిచిపోయారు. ఫిగర్ల పోస్టర్లు మళ్లీ ప్రత్యక్షం అయ్యాయి. దీంతో మళ్లీ ఇతర హీరోల ఫ్యాన్స్ లెక్కలు తీయడం మొదలు పెట్టారు. గాడ్ ఫాదర్ స్ట్రాటజీ ఏమిటంటే గతంలో రూపాయి మార్కెట్ వున్న దగ్గర పావలాకు, అర్థరూపాయికి అడ్వాన్స్ ల మీద సినిమా ఇచ్చారు. అక్కడ వాటిని చేరుకునే రేంజ్ కనిపించేసరికి సూపరో సూపర్ అంటున్నారు.

కానీ అదే గాడ్ ఫాదర్ ను విక్రయించిన నైజాం, ఓవర్ సీస్ ల్లో చూస్తే అసలు లెక్కలు తేలుతున్నాయి. ఆంధ్ర సీడెడ్ కూడా అమ్మి వుంటే ఈ పాటికి గోల మొదలయ్యేది. పరిస్థితి ఇలా వుంది అని తెలిసి కూడా పోస్టర్లు వేయడం ఎందుకు? రామ్ చరణ్ స్వయంగా గాడ్ ఫాదర్ నిర్మాణంలో భాగస్వామి. 

తన తండ్రికి సినిమా విడుదల ముందే రెమ్యూనిరేషన్ కూడా సెటిల్ చేసారని బోగట్టా. మరి అలాంటపుడు ఈ పోస్టర్లు వేయడం తన పాలసీ కి వ్యతిరేకం అని నిర్మాతకు, పీఆర్ టీమ్ కు చెప్పాలి కదా?