బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ తేజ్. దీంతో అతడి తాజా చిత్రం మట్కా బడ్జెట్స్ పై ఆ ప్రభావం గట్టిగా పడిందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత యూనిట్ సభ్యులు దాన్ని ఖండించారు కూడా. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్న విషయాన్ని మేకర్స్ ఒకటికి రెండుసార్లు చెబుతున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే జరిగింది.
ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. 35 రోజుల పాటు ఏకథాటిగా సాగే ఈ ఒక్క షెడ్యూల్ కోసమే అక్షరాలా 15 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట.
ఈ సినిమా కోసం ఫిలింసిటీలో పాత వైజాగ్ ను తలపించే సెట్స్ వేశారంట. దాంతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ కలుపుకొని 15 కోట్లు ఖర్చు అవుతోందని అంటున్నారు నిర్మాతలు. అలా పరోక్షంగా తమ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ లో ఎలాంటి కోతలు విధించలేదని చెబుతున్నారు.
కరుణ కుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రలో నోరా ఫతేహీ కనిపించనుంది. తీగల విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్, 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.