cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

'మయూరి' ని ఆపేసారు?

'మయూరి' ని ఆపేసారు?

ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పడు తగ్గాలో కూడా తెలియాలి అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ విషయం మీడియా టైకూన్ రామోజీరావుకు బాగా తెలుసు.తాను ఎంత ప్రేమించి, ప్రారంభించిన సంస్థలు అయినా, సరిగ్గా నడవకపోతే అస్సలు లాభాల సంస్థలతో పాటు ఇవీ వుంటాయి అని అలా వుంచుకోరు. ఇప్పుడు ట్రాఫికానా, రియల్ అంటూ రకరకాల బ్రాండ్లతో పళ్ల రసాలు మార్కెట్ లోకి వచ్చాయి. కానీ 80వ దశకంలోనే రామోజీరావు ఈ ఆలోచన చేసి 'సోమ' అనే పేరుతో పళ్ల రసాలు మార్కెట్ లోకి తెచ్చారు. కానీ అప్పట్లో ఇంకా ఈ అవేర్ నెస్ జనాలకు లేక అది హిట్ కాలేదు. దాంతో చటుక్కున మూసేసారు.

న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ పత్రికను భారీ కసరత్తు చేసి, మహా మహులను అపాయింట్ చేసి, ఓ కాన్సెప్ట్, క్వాలిటీతో తీసుకువచ్చారు. కానీ డెక్కన్ క్రానికల్ లాంటి మాస్ డైలీ ముందు ఈ క్లాస్ డైలీ నిలవలేదు. పైగా అప్పట్లో ఇంకా ఇంగ్లీష్ డైలీలకు అంత మార్కెట్ లేదు. దాంతో దాన్నీ మూసేసారు.

ఇటీవలే విపుల, చతుర, సితార, బాల భారతం, తెలుగు వెలుగు పత్రికలు ప్రింటింగ్ ఆపేసి ఈ పేపర్లకు పరిమితం చేసారు. లేటెస్ట్ గా మరో సంస్థను కూడా మూసేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. మయూరి పేరుతో రామోజీరావు అవిభక్త రాష్ట్ర వ్యాప్తంగా సినిమాల డిస్ట్రిబ్యూషన్ కోసం సంస్థను ప్రారంభించారు. దీని కోసం అన్నీ స్వంత సెటప్ లు, స్టాఫ్ అంతా చేసారు. కొన్ని థియేటర్లు కూడా తీసుకున్నారు.  కానీ అనార్గనైజ్డ్ సెక్టార్ అయిన టాలీవుడ్ లో అన్నీ ఆర్గనైజ్డ్ గా వుండాలనుకునే రామోజీరావు నెగ్గలేకపోయారు.

ఉషాకిరణ్ మీద సినిమాలు తీయాలనుకున్నా ఇదే సమస్య. సగం బ్లాక్, సగం వైట్ వ్యవహారం టాలీవుడ్ ది. అంతా పక్కాగా లెక్కలు అనే టైపు రామోజీ. దాంతో ఉషాకిరణ్ మీద సినిమాలు తీయడం దాదాపు తగ్గించేసారు. కానీ మయూరి సంస్థను అలా లిమిటెట్ స్టాఫ్ తో నడుపుకుంటూ వచ్చారు. ఆ మధ్య బిచ్చగాడు లాంటి హిట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ మయూరినే చేసింది.

కానీ కరోనా నేపథ్యంలో, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మయూరి సంస్థను పూర్తిగా మూసివేసారని, అందులో వున్న సిబ్బందికి ఫుల్ పేమెంట్లు ఇచ్చి సెటిల్ చేసారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మయూరిని క్లోజ్ చేసేసినట్లా?లేక సంస్థను అలా అబేయన్స్ లో వుంచేసి, స్టాఫ్ ను తీసేసినట్లా? అన్న క్లారిటీగా తెలియాల్సి వుంది.

కరోనా బారిన బాలు

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

 


×