ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ వుంటుంది. రియలిస్టిక్ పాత్రలు తీసుకుని, వాస్తవ సంఘటనలను ప్రతిబింబిస్తూ సినిమా తీసే టాలెంట్ కొందరికి వుంటుంది. ఈ మధ్య అలాంటి దర్శకుడు ఓ ఆలోచన చేసాడని తెలుస్తోంది.
తెలుగు న్యూస్ చానెళ్లలో వివాదాస్పదంగా పాపులర్ అయిన ఇద్దరు యాంకర్ల క్యారెక్టర్లను, వర్తమాన రాజకీయాలను బేస్ చేసుకుని ఓ సినిమా తీసే ఆలోచన అది. అలాంటి సినిమా ఓ రాజకీయ పార్టీకి కాస్త పనికి వస్తుంది.
ఈ ప్రతిపాదన, ఆలోచన సదరు దర్శకుడికి వుందని ఉప్పు అందిన ఆ పార్టీ అభిమానులు కొందరు వెంటనే అతగాడిని సంప్రదించారట. అయితే అలా సినిమా తీసి ఇవ్వాలంటే పది కోట్లు కావాలన అడగడంతో వెనకడుగు వేసారట. ఆ ఇద్దరు న్యూస్ యాంకర్ల ను పోలిన నటులను తీసుకురావడం, అదే విధమైన బాడీ లాంగ్వేజ్, మాట తీరు సెట్ చేయడంతో పాటు సెటైరికల్ సబ్జెక్ట్ ను తయారు చేయాల్సి వుంది.
వీటన్నింటికి తోడు ఇలా చేయడం వల్ల వచ్చే ట్రోలింగ్ ను తట్టుకోవాలి. మీడియాకు..పార్టీలకు టార్గెట్ కావాలి. అందుకే ఈ మేరకు రేటు కోట్ చేసి వుంటారేమో? అయినా పార్టీకి పనికి వస్తుందనుకుంటే ఖర్చుకు వెనకాడకుండా చేసుకోవడమే.