ఎన్నాళ్లయింది సమంత ను ఓపెన్ డయాస్ మీద చూసి. అనుకోని అనారోగ్యం బారిన పడడంతో సమంత బయటకు రావడం లేదు. జస్ట్ వన్ డే ముందు ముంబాయి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. అప్పటి వరకు ఇంట్లో నుంచి వీడియోలు వదిలి ఫ్యాన్స్ తో మాట్లాడడం తప్ప మరేం లేదు.
ఆ మధ్య యశోద సినిమా వచ్చినా ప్రమోషన్స్ కు రాలేకపోయింది. చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఓ ప్రమోషన్ ఇంటర్వూను ఇంట్లోనే చేసి పంపాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు మరో సినిమా శాకుంతలం వస్తోంది. ఇది కూడా ఒక విధంగా హీరోయిన్ సెంట్రిక్ సినిమానే. ఈ సినిమా ట్రయిలర్ ఇప్పుడు విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ ట్రయిలర్ ఫంక్షన్ కు సమంత ను తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సమంత కూడా ఓపెన్ డయాస్ మీదకు రావాలనే అనుకుంటున్నారని తెలుస్తోంది,
అందువల్ల సోమవారం జరిగే ట్రయిలర్ ఈవెంట్ కు మూడు వంతులు సమంత హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. సమంత హజరయితే మీడియా నుంచి పెద్దగా ఇబ్బంది కర మైన ప్రశ్నలు కూడా ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సమంత ఇప్పటికే తన సమస్య ఏమిటి అన్నది క్లారిటీగా సోషల్ మీడియా వేదికగా చెప్పేసింది. దాని వల్ల అభిమానుల నుంచి ఎంతో అభిమాన పూర్వకమైన సింపతీ గైన్ చేసింది.