Advertisement

Advertisement


Home > Movies - Movie News

మీడియాపై జ‌ర్నలిస్ట్ దాడి

మీడియాపై జ‌ర్నలిస్ట్ దాడి

మీడియాపై విమర్శలు అనేవి ఎప్పుడూ వుంటూనే వుంటాయి. అన్ని రంగాల్లో విలువల క్షీణత అన్నది అనివార్యమైంతో, మీడియా కూడా దానికి అతీతం కాలేదు. తరచు ఏదో ఒక సినిమాలోనో, మరే మాధ్యమంలోనో మీడియాకు అక్కడక్కడ చురకలు తగిలిస్తూనే వుంటారు. 

పూరి జ‌గన్నాధ్ లాంటి దర్శకులు వేసే సునిశిత వాతల వెనుక కాస్త నిజాలు కూడా వుంటాయనిపిస్తుంది. కానీ మీడియా మీదే పూర్తి స్థాయిలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రావడం అరుదు. ఇప్పుడు వస్తోంది. పైగా ఈ కథను తయారు చేసింది కూడా జ‌ర్నలిస్ట్ నే కావడం విశేషం. ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రముఖ సంపాదకుడు పతంజ‌లి జ‌ర్నలిస్ట్ ల మీద ఓ నవలే రాసారు. పెంపుడు జంతువులు అనే నవల పత్రికరంగంలోని చీకటి కోణాలను వెల్లడిస్తుంది.

ప్రియదర్శిని రామ్ గా పాపులర్ అయిన సాక్షి రామ్ రెడ్డి ఇప్పుడు ఆహా వెబ్ సిరీస్ కు ఓ కథ అందించారు. వెబ్ సిరీస్ పేరు న్యూసెన్స్. న్యూస్ సెన్స్ కాస్తా న్యూసెన్స్ గా మారితే ఎలా వుంటుందనే భావన కావచ్చు. వెబ్ సిరీస్ కు రామ్ కథ అందిస్తే పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. నవదీప్-బిందుమాధవి కీలకపాత్రలు.

ఈ న్యూసెన్స్ టీజ‌ర్ విడుదలయింది. టీజ‌ర్ మొత్తం మీడియా మీద సెటైర్లు, విమర్శలతో సాగడం విశేషం. పక్కదారి పడుతున్న మీడియా లక్ష్యాలు, మీడియాలో డబ్బు ప్రమేయం, ఇలా అన్నీ ట్రయిలర్ లో కనిపించాయి. పీపుల్స్ మీడియా సంస్థ అధినేతలు విశ్వప్రసాద్, వివేక్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. సంచలనం సృష్టిస్తుందా..సంచలనంగా మిగలుతుందా? మనకెందుకులే అని మీడియా వీపు తడుముకోకుండా సైలంట్ గా వుంటుందా చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?