ఎక్కడికి రమ్మన్నా వస్తా – నటి హేమ

తనకు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందంటే ఓ సెక్షన్ మీడియా నమ్మడం లేదని, అందుకే తనే ముందుకొస్తానని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, మీడియానే తనకు టెస్టులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు నటి హేమ.…

తనకు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందంటే ఓ సెక్షన్ మీడియా నమ్మడం లేదని, అందుకే తనే ముందుకొస్తానని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, మీడియానే తనకు టెస్టులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు నటి హేమ.

“మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నాకు టెస్టులు చేయించండి. మీకు అన్ని శాంపిల్స్ ఇస్తాను. పాజిటివ్ వస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తా. నాకు నెగెటివ్ వచ్చిందని చెబుతుంటే మీరు నమ్మడం లేదు. నేను చేయించుకున్న టెస్టులు మీరు నమ్మకపోతే, నేనే వస్తాను, మీరే నాకు టెస్టులు చేయించండి. మీడియా సంస్థల యజమానులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లో నన్ను మీ దగ్గరకు పిలవండి.”

కుటుంబం తలదించుకునే పని ఎప్పుడూ చేయలేదని, పరువు కోసం చచ్చిపోతానని అంటున్నారు హేమ. ఇండస్ట్రీ తలదించుకునే పని ఎప్పుడూ చేయనంటున్నారు.

“నాకు పాజిటివ్ వచ్చిందని గతంలో కొంతమంది మీడియా వాళ్లు ఎలాగైతే చెప్పారో.. అదే పాత న్యూస్ మళ్లీ తీసొకొచ్చి నాకు పాజిటివ్ వచ్చిందని టెలికాస్ట్ చేస్తున్నారు. ఛార్జ్ షీట్ నేనే ఇంకా చూడలేదు. నాకే అందలేదు, అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది. ఇలాంటి వార్తల్ని ఎందుకు ప్రసారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.”

3 రోజుల కిందట ఓ వీడియో పెట్టారు హేమ. తన లాయర్ ఫోన్ చేశాడని, తనకు నెగెటివ్ వచ్చినట్టు ఛార్జ్ షీట్ లో ఉందని లాయర్ చెప్పాడని అన్నారు. అంతలోనే, ఇలా మరో వీడియో పెట్టి మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆరోపిస్తున్నారు.

14 Replies to “ఎక్కడికి రమ్మన్నా వస్తా – నటి హేమ”

  1. నెనెప్పుడొ చిన్నప్పుడు మొదటిసారి నిన్ను ..మహెష్ బాబు కొడుకు దిద్దిన కాపురం సినిమాలొ పూలు అమ్మె అమ్మాయిగా చూసా ..ఇప్పుడు నాకు గడ్డం కూడ తెల్లబడింది ..ఇంకా ఎందుకు అక్క ఇవన్ని….. మిడియా ముందు హంగమా ..కాం గా వుండచ్చుగా

Comments are closed.