పిఎస్ 2 యూనిట్ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ మీట్ ఘనంగా ఏర్పాటు చేసారు. కానీ యూనిట్ వ్యవహారం మాత్రం చిత్రంగా వుంది. పిఎస్ వన్ ప్రీ రిలీజ్ మీట్ చెన్నయ్ లో జరిగినపుడు హైదరాబాద్ నుంచి మీడియాను తీసుకువెళ్లి మరీ వార్తల కవరేజ్ కు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇప్పుడు అదే యూనిట్ హైదరాబాద్ వచ్చి ఫంక్షన్ చేస్తోంది. కానీ ఈ ఫంక్షన్ కు ఇటు మీడియా కానీ అటు ప్రెస్ ఫొటొగ్రాఫర్లు కానీ వద్దు అని డిసైడ్ అయిపోయింది. తామే ప్రెస్ నోట్ లు రాయించి ఇస్తామని, అలాగే ఫొటోలు తీయించి ఇస్తామని చెప్పేసారు.
ఇదంతా సినిమా నిర్మాణ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సుహాసిని మణిరత్నం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. భారీగా నోవాటెల్ ఆవరణలో పబ్లిక్ ఫంక్షన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన వారందరూ దాదాపుగా ఫంక్షన్ కు వచ్చారు. కార్తీ, విక్రమ్, త్రిష ఇంకా మరి కొందరు. పబ్లిక్ ను ఈవెంట్ కు ఆహ్వానించారు. అందుకోసం పాస్ లు జారీ చేసారు.
అంతా బాగానే వుంది. కానీ మీడియా కానీ మీడియా ఫొటొగ్రాఫర్స్ కానీ నాట్ అలౌడ్. కానీ మళ్లీ పబ్లిష్ చేయడానికి ఫొటోలు, ప్రెస్ నోట్ లు మాత్రం విడుదల చేస్తారట. ఏమిటో చిత్రం.