హీరోయిన్లను ప్రేమ గురించి అడిగితే వచ్చే కామన్ ఆన్సర్ ఒక్కటే. 'నేను సింగిల్' అని మాత్రమే చెబుతారు. అయితే హీరోయిన్ సాక్షి వైద్య మాత్రం దీనికి ఇంకాస్త కొనసాగింపు ఇస్తోంది. తను లవ్ లో పడలేదని, కానీ కొన్ని లవ్ మేటర్స్ మాత్రం సెట్ చేశానని చెబుతోంది.
ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మకు, అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారట. అందులో లవ్ కపుల్స్ కూడా ఉన్నారట. వాళ్ల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవల్ని సర్దుబాటు చేయడంతో పాటు, మనసులో ఉన్న ప్రేమను బయటకు చెప్పలేక ఇబ్బందిపడుతున్న కొంతమంది ఫ్రెండ్స్ ను కూడా కలిపానంటోంది.
ఇన్ని చెప్పిన ఈ బ్యూటీ, తను మాత్రం ఇంకా ప్రేమలో పడలేదంటోంది. ఇప్పటివరకు యాడ్స్ తో, ఇకపై సినిమాలతో బిజీగా ఉండబోతున్నట్టు తెలిపింది.
అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది సాక్షి వైద్య. అఖిల్ ను రొమాంటిక్ వైల్డ్ బాయ్ గా పేర్కొన్న ఈ చిన్నది, సెట్స్ లో అఖిల్ తనకు బాగా కోపరేట్ చేశాడని చెబుతోంది.
ఏజెంట్ సినిమానే సాక్షికి కెరీర్ లో మొదటి సినిమా. పైగా ఇది తెలుగు సినిమా. అందులోనూ సాక్షిది రాయలసీమ అమ్మాయి పాత్ర. దీంతో రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడిందట. అయితే తను మాత్రం హిందీలో డైలాగ్స్ చెప్పానని, వాటిని డబ్బింగ్ ఆర్టిస్టుతో కవర్ చేశారని అంటోంది.