చాటింగ్ ల్లో చిక్కిన హీరోల లెక్కలు?

ఇన్ కమ్ టాక్స్ దాడుల వ్యవహారం భలే చిత్రంగా వుంటాయి. చివరి వరకు ఎంత రహస్యంగా వుంచుతారంటే, దాడుల్లో పాల్గొనే వారిలో చాలా మందికి కూడా టార్గెట్ ఏమిటన్నది లాస్ట్ మినిట్ వరకు తెలియదు.…

ఇన్ కమ్ టాక్స్ దాడుల వ్యవహారం భలే చిత్రంగా వుంటాయి. చివరి వరకు ఎంత రహస్యంగా వుంచుతారంటే, దాడుల్లో పాల్గొనే వారిలో చాలా మందికి కూడా టార్గెట్ ఏమిటన్నది లాస్ట్ మినిట్ వరకు తెలియదు. అలాగే దాడులు జరిగిన తరువాత కూడా అఫీషియల్ ప్రకటనలు ఏమీ వుండవు. 

జరిగినన్ని రోజులు ఏం జరుగుతోందో తెలియదు. జరిగిన తరువాత క్యాష్ దొరికిందా..ఇంకేంటి లెక్కలు అన్నవి వారు బయట పెట్టరు. కేవలం ఇరు వర్గాలకు తప్ప మూడో వ్యక్తికి వైనం తెలియదు. ఈ లోగా రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తూ వుంటాయి.

టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ పై ఆదాయపన్ను దాడులు మొదలై ఈ రోజుకు అయిదు రోజులు అయింది. ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రోజుతో ముగియవచ్చని వినిపిస్తోంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, దర్శకుడు సుకుమార్, ఈ ముగ్గురితో సంబంధాలున్న పలువురు ఉద్యోగులు, ఫైనాన్సియర్లు, ముంబాయి సంస్థలు ఇలా అందరి ఆఫీసుల మీద సోదాలు జరిగాయని, జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రకరకాల గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది. దర్శకుడు సుకుమార్ క్యాష్ ట్రాన్సాక్షన్ లు కాస్త ఎక్కువ వున్నాయన్నది ఓ గుసగుస.  మైత్రీ సంస్థ విదేశాల నుంచి తెచ్చిన అప్పులు ఆర్ బి ఐ రూల్స్ కు కాస్త విరుద్దంగా వున్నాయన్నది మరో గుస గుస. ఇవన్నీ ఇలా వుంచితే ఓ ఆసక్తికరమైన గ్యాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మైత్రీ అధినేతలు తమ తమ వాట్సాప్ చాట్ లు అస్సలు డిలీట్ చేయలేదు అన్నది చక్కర్లు కొడుతున్న గ్యాసిప్. సాధారణంగా వాట్సాప్ చాట్ లు ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటారు ఎవరైనా. కాస్త ఇంపార్టెంట్ మాత్రం స్టార్ మార్క్ చేసుకుంటారు. లేదా డిలీట్ చేయకుండా వుంచుకుంటారు. మైత్రీ అధినేతలు వారి వారి చాట్ లు అలాగే వుంచుకున్నారని, వీటిలో ఏ హీరోకి ఎంత పంపారు? ఎప్పుడు పంపారు? లాంటి కీలకమైన సమాచారం వుందని బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆన్ లైన్ లో వైట్ పంపితే చాట్ లో దాచుకోనక్కరలేదు. కానీ బ్లాక్ పంపితేనే ఇలా చాట్ ల్లో గుర్తుగా వుంచుకుంటారు.

ఇలాంటి చాట్ లు అన్నీ అధికారులకు దొరికాయి అన్నది వినిపిస్తున్న అతి పెద్ద గ్యాసిప్. నిజంగా ఇదే నిజమై, ఐటి అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకుంటే, దాని ప్రభావం హీరోల మీద కూడా పడుతుంది. మొత్తం మీద ఈ రైడ్స్ ఇవ్వాళ ముగుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి నుంచి స్టేట్ మెంట్ లు తీసుకుంటున్నారని, ఇక ముగియవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. రేపటికి మరి కొంత క్లారిటీ రావచ్చు.