మీలో..ఎన్టీఆర్..కోటీశ్వరుడు

హీరో ఎన్టీఆర్ జెమిని టీవీలో ఓ షో చేయబోతున్నాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి కీలకమైన మరో అప్ డేట్. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు…

హీరో ఎన్టీఆర్ జెమిని టీవీలో ఓ షో చేయబోతున్నాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి కీలకమైన మరో అప్ డేట్. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో నే ఎన్టీఆర్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ చాలా ట్విస్ట్ లు వున్నాయి.

వాస్తవానికి ఈ షో స్టార్ మా చానెల్ ది. అక్కడ ఏదో సమస్య వుందో, అగ్రిమెంట్ ముగిసిందో సమ్ థింగ్ జరిగింది. దాంతో జెమిని ఛానెల్ కు ఆ షో వచ్చింది. అయితే ఆ టైటిల్ ను వాడుకోవడం లేదు. వేరే టైటిల్ ను వెదుకుతున్నారు.

ప్రస్తుతానికి ఆ పేరు మీదే అన్నపూర్ణ స్టూడియోలో రెండు ఫ్లోర్ లు బుక్ చేసారు. దాంతో ఈ న్యూస్ కాస్తా బయటకు వచ్చేసింది.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి వుంది.

ఈ షో కోసం వారానికి ఒకటి రెండు రోజులు కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఈ షో కి ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టయిల్, గెటప్ అన్నీ డిఫరెంట్ గా వుండేలా ప్లానింగ్ ప్రారంభమైంది.

ఈ రోజు నుంచి నా పేరు డాన్