మీనాకు ఆ హీరోతో రెండో పెళ్లి: తమిళ నటుడు

నటి మీనా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా ఆమె వాడిని ఖండిస్తూ వ‌స్తున్నప్ప‌టికి.. ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్‌ పడటం లేదు.…

నటి మీనా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా ఆమె వాడిని ఖండిస్తూ వ‌స్తున్నప్ప‌టికి.. ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్‌ పడటం లేదు. తాజాగా త‌మిళ న‌టుడు బెయిల్వన్ రంగనాథన్ మీనా రెండో పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓ తమిళ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ.. మీనాకు జూలైలో ఓ 39 ఏళ్ల పాన్ ఇండియా స్టార్ తో వివాహం జ‌ర‌గ‌నుంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆ న‌టుడు ఎవ‌రా అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. కాగా గతంలోనే మీనా తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఓ ఇంటర్య్వూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. రంగ‌నాథ‌న్ వ్యాఖ్య‌ల‌ను మీనా అభిమానులు కూడా ఫైర‌వుతున్నారు.

ఈ ఏడాది జూన్ నెలలో ఆమె భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వీరికి నైనినా అనే పాప ఉంది.  భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. ఇటీవ‌లే  'ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్‌ చేసింది.