మొన్నటికిమొన్న ఊర్వశి రౌథేలా ప్రైవేట్ వీడియో ఒకటి సంచలనంగా మారింది. బాత్రూమ్ లో బట్టలు తీస్తున్న వీడియో అది. ఆ తర్వాత ఆ వీడియోపై ఊర్వశి కూడా స్పందించింది. అది తన వీడియో అని చెబుతూనే, ఓ సినిమా షూటింగ్ కు సంబంధించిన క్లిప్ అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఇప్పుడు అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. ఈసారి మీరా చోప్రా వంతు. హీరోయిన్ మీరా చోప్రాకు పరిచయం అక్కర్లేదు. ఆమె బెడ్ రూమ్ లో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే అది ఒరిజినల్ వీడియోనా లేక ఏఐ మార్ఫింగ్ వీడియోనా అనే విషయంపై స్పష్టత లేదు. చాలామంది మాత్రం అది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో చేసిన డీప్ ఫేక్ వీడియో అని అంటున్నారు. మీరా చోప్రా మాత్రం దీనిపై స్పందించలేదు.
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. రష్మిక నుంచి మొదలుపెడితే అలియా భట్, దీపిక పదుకోన్, కాజోల్, కియరా అద్వానీ, జాన్వి కపూర్.. ఇలా చాలామంది హీరోయిన్లు ఈ బాధ అనుభవించారు.
మీరా చోప్రా శృంగారభరిత వీడియో కూడా ఆ కోవలోకి చెంది ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 41 ఏళ్ల మీరా చోప్రా తాజాగా పెళ్లి చేసుకుంది. ప్రియుడు రక్షిత్ కేజ్రీవాల్ తో ఆమె వైవాహం వైభవంగా జరిగింది. అలా పెళ్లయిన 4 నెలలకే ఇలా ఓ వీడియో ప్రత్యక్షమవ్వడం, అది మీరా చోప్రాదే అంటూ ప్రచారం జరగడం బాధాకరం.
మొగుడు చూడట్లేదని అందరికీ చూపిస్తోందేమో
జనం పట్టించుకోరు