మిస్టర్ బచ్చన్ సినిమా వస్తోంది. హిందీ సినిమా రైడ్ కు రీమేక్. అది అందరికీ తెలిసిన సంగతే. రవితేజతో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న మూడో సినిమా ఇది. తొలి సినిమా ధమాకా బ్లాక్ బస్టర్. ఆ తరువాత రవితేజకు అన్నీ వరుస డిజాస్టర్లే.
పీపుల్స్ మీడియా రెండోసారి రవితేజతో తీసిన ఈగిల్ అయితే మరీ దారుణమైన ఫలితం ఇచ్చింది. ఏ హక్కులు విక్రయించకుండా రిస్క్ చేసి మరీ విడుదల చేసి చాలా అంటే చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇది మూడో సినిమా. కచ్చితంగా హిట్ కావాలి. మంచి డబ్బులు తేవాలి. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు లాభాలు లేవన్నది ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. ఓ అయిదు నుంచి పది కోట్లు డెఫిసిట్ అన్నది ఇన్ సైడ్ వర్గాల సమాచారం.
ఆ సంగతి అలా వుంచితే రామబాణం, ఈగిల్, మనమే ఇలా భారీ నష్టాలు చవి చూపించిన సినిమాలు పీపుల్స్ మీడియాకు వున్నాయి. వాటితో పోల్చుకుంటే మిస్టర్ బచ్చన్ చాలా అంటే చాలా బెటర్. కానీ ఈ సినిమా హిట్ అయితే గత నష్టాలు కొంత వరకు పూడుకుంటాయి. ఆ విధంగా బచ్చన్ సినిమా హిట్ కావడం అన్నది పీపుల్స్ మీడియాకు చాలా అంటే చాలా అవసరం.
ఇక రవితేజ విషయానికి వస్తే రాజా ది గ్రేట్ సినిమా తరువాత వరుసగా నాలుగు ఫ్లాపులు వచ్చాయి. అప్పుడు క్రాక్ సినిమా పడింది. తరువాత రెండు ఫ్లాపులు పడ్డాయి. ధమాకా వచ్చింది. తరువాత మూడు ఫ్లాపులు పడ్డాయి. ఇప్పుడు బచ్చన్ సినిమా వస్తోంది. అందువల్ల ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడితే మళ్లీ మరో మూడు నాలుగు సినిమాల వరకు ఢోకా వుండదు.
అందువల్ల అటు నిర్మాతకు, ఇటు హీరోకి బచ్చన్ సినిమా హిట్ కావడం చాలా అవసరం.
జనం పట్టించుకోరు
మాకు అవసరం లేదు