జ‌గన్ సన్నిహిత మంత్రికి ఏపీ ప్ర‌భుత్వం నోటీసులు!

విశాఖ‌లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై…

విశాఖ‌లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది. నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఏడాది కిందట జ‌గ‌న్ ప్రభుత్వ హ‌యంలో భూగ‌ర్భ విద్యుత్ లైన్ల‌ కాంట్రాక్టు దక్కించుకున్న రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. ఇప్ప‌టికే ప‌లు సార్లు డిస్కం నుండి నోటీసులు పంపుతునే ఉన్న కాంట్రాక్టర్ సంస్థ ప‌నులు మొద‌లుపెట్ట‌లేద‌ని.. వెంట‌నే ప‌నులు మొద‌లుపెట్ట‌కపోతే సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చింది.

విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం ఆర్డీఎస్ఎస్ లో భాగంగా ప్రతిపాదించిన పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయక‌పోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు నిలిచిపోతుందని నోటీసుల్లో ఏపీఈపీడీసీఎల్ హెచ్చ‌రించినట్లు తెలుస్తోంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. అదే విధంగా తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా ఉన్న నేప‌ధ్యంలో ఏపీ ప్ర‌భుత్వం నోటీసులు చ‌ర్చ‌కు దారి తీశాయి. ఏపీ, తెలంగాణ సీఎంల మ‌ధ్య ఉన్న‌ రిలేషన్ నేప‌ధ్యంలో పొంగులేటి సంస్థ‌పై ఎటువంటి చర్య‌లు తీసుకుంటారు అనేది చూడాలి.

5 Replies to “జ‌గన్ సన్నిహిత మంత్రికి ఏపీ ప్ర‌భుత్వం నోటీసులు!”

  1. టైటిల్ ఏమిటి స్వామి .. కాంట్రాక్టు దక్కించుకుని పని మొదలు పెట్టక పోతే ఎవరైనా అడగాలి .. ఇది కూడా కాతా లో వేసేయడమేనా ..

  2. మూతవేత దిశగా టీడీపీ పార్టీ.

    2029 లోపు బాబు చనిపోతాడు. లే .కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది 

    ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది

  3. పొంగులేటి శ్రీనివాసరెడ్డి is the most corrupt minister in Telangana and worst person . C.M Revanth Reddy Should remove him from portifoilo.

Comments are closed.