విశ్వం… వైట్ల విశ్వరూపం అయ్యేనా!

శ్రీనువైట్ల మంచి దర్శకుడు. ఎలాంటి సినిమాలు అందించారు అన్నది అందరికీ తెలుసు. ఇప్పటికీ తలుచుకునే సినిమాలు. తరువాత తరువాత తనకు తానే ఫ్లాపులు ఇచ్చుకుని వెనుకబడిపోయారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని అందిస్తున్న సినిమా…

శ్రీనువైట్ల మంచి దర్శకుడు. ఎలాంటి సినిమాలు అందించారు అన్నది అందరికీ తెలుసు. ఇప్పటికీ తలుచుకునే సినిమాలు. తరువాత తరువాత తనకు తానే ఫ్లాపులు ఇచ్చుకుని వెనుకబడిపోయారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని అందిస్తున్న సినిమా విశ్వం.

పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ..ది జ‌ర్నీ ఆఫ్ విశ్వం.. అనే గ్లింప్స్ ను వదిలారు. శ్రీను వైట్ల టేకింగ్ ఎక్కడికీ పోలేదు. అనేటట్లు వుంది ఈ గ్లింప్స్. ఫుల్ యాక్షన్ మోడ్ లో కట్ చేసారు. వైట్ల ఎక్స్ ప్రెస్ అన్నందుకు అంత స్పీడ్ గానూ వుంది.

శ్రీను వైట్ల కెెరీర్ బెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ సీన్లు ఎన్నో వున్నా, వెంకీ ట్రయిన్ సీన్ ఎప్పటికీ మరిచిపోలేము. మళ్లీ దాన్ని రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కట్ కి చివర్న కొసమెరుపుగా ఈ ట్రయిన్ సీన్ ను యాడ్ చేసారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. విదేశీ లోకేషన్లు కొత్త ఫీల్ ను యాడ్ చేసాయి.

కాస్త భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. సరైన హిట్ లేకుండా వున్న గోపీచంద్ కు హిట్ ఇచ్చి, శ్రీను వైట్ల తాను కమ్ బ్యాక్ అవుతారేమో చూడాలి విశ్వం సినిమాతో.

2 Replies to “విశ్వం… వైట్ల విశ్వరూపం అయ్యేనా!”

  1. ఎన్ని కాంబినేషన్స్ సెట్ చేసినా వీడికి హిట్ పడదు. మళ్ళీ విలన్ గా ట్రై చేసుకుంటే బెటర్.

Comments are closed.