తన సినిమాలు ప్లాప్ కావడానికి మీడియానే కారణమని ఒక డైరెక్టర్ నమ్మాడు. నెగిటివ్ రివ్యూలు రాసి గొప్ప డైరెక్టర్ల కెరీర్‌ని, ఉత్తమ సినిమాల తలరాతని నిర్ణయిస్తున్న జర్నలిస్ట్‌ల పని పట్టాలని నిర్ణయించుకున్నాడు.
సమావేశం ఏర్పాటు చేసి తలుపులు మూసి అందరిని దుడ్డుకర్రతో చావబాదాలని స్కెచ్ వేసాడు. రాబోయే తుపానుని ముందే పసిగట్టే గద్దల్లా రిపోర్టర్లు కూడా తెలివి మీరి పోయారు. పెన్నులని సాన పెట్టించుకుని వచ్చారు. డైరెక్టర్ తలుపులు మూయగానే పెన్నుల్ని నొక్కారు. కుంగ్‌పూ సినిమాల్లో మాదిరి సక్‌సక్‌మనే సౌండ్‌తో పెన్నులు విచ్చుకత్తుల్లా మెరిసాయి. ఈ రకమైన యుద్ధ శబ్ధాన్ని డైరెక్టర్ నేరుగా ఎపుడూ వినలేదు. అతనిదంతా గ్రాఫిక్స్. హీరోలతో ఫైట్స్ చేయించి సినిమాని దివాళా తీయిస్తాడు కానీ, నేరుగా ఫైట్ చేయలేడు.
వెన్నుపోటు కంటే పెన్నుపోటు ప్రమాదమని గ్రహించి, తలుపులు తెరిచి, కర్ర ముడిచి రాజీకొచ్చాడు. విలేకరులు కూడా కలం వెనుక వున్న కత్తిని దాచి మర్యాదగా దండం పెట్టారు.
“ఇపుడే కదా, కత్తులు తీసారు. అపుడే దండం పెడుతున్నారు. మీరు మహా మాయగాళ్లు” అన్నాడు డైరెక్టర్ ఆశ్చర్యంగా.
“కుదిరితే దండం , కుదరకపోతే కోదండం” అన్నాడు విలేకరి.
“నా సినిమా రిలీజ్ కాకుండానే ప్లాప్ అని రాస్తున్నారే”
“మీరెలాగూ ప్లాప్ సినిమానే తీస్తారని మా ఆత్మ విశ్వాసం”
“ఈ సారి నేను బ్లాక్ బస్టర్ తీసాను తెలుసా”
“బ్లాక్ బోర్డ్ డస్టరేం కాదా, రియాలిటీ మిస్ అయ్యేవాడు క్రియేటివ్‌గా తీయలేడు”
“అంటే నేను రియల్ ఎస్టేట్ సినిమా తీయాలా?”
“అలా అర్థమైందా? రియాలిటీ అంటే వాస్తవం. సినిమా భ్రాంతి కావచ్చు. కానీ ప్రేక్షకుడు నిజం. మీకేం కావాలో మీకే తెలియదు. ప్రేక్షకుడికి ఏం కావాలో ఎలా తెలుస్తుంది. సినిమాల్లో పురాణాల డైలాగ్‌లు ఎవరైనా వాడుతారు. వాటిని అర్థం చేసుకోవడం కష్టం. యాటిట్యూడ్ అంటే ఇంటిపేరు కాదు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడే నోరు”
“మీరు నాకు నీతులు చెబుతున్నారా?”
“నీతులు చెబితే ఎవరు వింటారు? ప్రతివాడు నేతులు తాగిన పోజులు కొడుతుంటే! ఇంత పెద్ద ప్రపంచంలో తెలుగు చాలా చిన్న భాష. తెలుగు సినిమా ఇంకా చిన్నది. ఇది గుర్తించకుండా సినిమా ఇండస్ట్రీలో వున్న ప్రతివాడు తోపు, తురుముఖాన్ అనుకుంటూ జీవిస్తూ వుంటే కామెడీ కాదా?”
“కానీ మన తెలుగులో ఈ రోజు ప్రపంచ సినిమాలు వస్తున్నాయి తెలుసా”
“తెలుసు, అవి తీస్తున్న వాళ్లెవరూ మీలా నోటికొచ్చింది మాట్లాడింది లేదు. డైరెక్టర్‌కి రెక్కలుండాలి. ప్రేక్షకున్ని వేరే ప్రపంచంలోకి మోసుకెళ్లాలి. అంతే కానీ కొమ్ములు పెంచుకుని ప్రేక్షకుల్ని కుమ్మకూడదు”
“కొమ్ముల్ని పెంచుకోవడం విలేకరుల లక్ష్యం. మీ ఇన్‌ఫీరియారిటీని కప్పి పుచ్చుకోడానికి నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను బయట కనిపిస్తే వంద మంది సెల్ఫీ దిగుతారు. వెయ్యి మంది వెంట పడతారు. మీ ముఖం ఎవరైనా గుర్తు పడతారా?”
“మా కలమే మా ముఖం. మా రాతని గుర్తు పడితే చాలు. మీలా మాది గ్లామర్ కాదు, గ్రామర్”
“డబ్బులిస్తే పాజిటివ్ రివ్యూలు రాయడమే కదా మీ గ్రామర్”
“పాజిటివ్ రాస్తే డబ్బులు తీసుకుని రాసామంటారు. నెగిటివ్ రాస్తే డబ్బులు ముట్టలేదంటారు. రాళ్లు విసురుతారని చెట్టు కాయలు కాయడం మానుతుందా? రాయడం మా వృత్తి. అయినా చెత్త సినిమాలకి వెయ్యి పాజిటివ్ రివ్యూలు వచ్చినా బతకదు. మంచిసినిమాకి వెయ్యి చెత్త రివ్యూలు రాసినా దాన్ని చంపలేరు. ప్రేక్షకుడు సొంత జడ్జిమెంట్ వుండేవాడు”
“అయినా మేము కొన్నాళ్లపాటు కష్టపడి , కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే, తీర్పులిచ్చే హక్కు మీకెవరిచ్చారు?”
“ప్రేక్షకుడు, మీ వందల కోట్లు కంటే , ప్రేక్షకుడి వంద రూపాయలకి మా దృష్టిలో విలువ ఎక్కువ. మీ సరుకులో నాణ్యత వుంటే ప్రచారం అదే వస్తుంది. పెళ్లి కొడుకు పారిపోతే, బళ్లారి డ్రమ్స్ వాళ్లని చావబాదితే ఏమొస్తుంది. అయినా నలుగురు భజంత్రీలని చుట్టు పెట్టుకుని , పొగడ్తలని ఆనందిస్తూ జీవించే మీకు ఈ ప్రపంచంలో ఏం జరుగుతూ వుందో ఎలా తెలుస్తుంది? చుట్టూ వున్న కథల్ని గుర్తు పట్టడం మరిచి, ఎవరి దగ్గర్నో అరువు తెచ్చుకునే దర్శకుల్ని చూసి జాలిపడడం తప్ప ఏం చేయగలం?”
“ఏదో రోజు మీ సంగతి చూస్తా”
“చూస్తామన్నవాళ్లంతా రిపేరిషెడ్‌కి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరు, మేము వెలుగునీడల్లాంటి వాళ్లం. మీరున్నంత కాలం మేమూ వుంటాం”
సమావేశం ముగిసింది (ఇది ఒకరిని ఉద్దేశించి రాసింది కాదు)
జీఆర్ మహర్షి
Ari….issh🤫
ఒక పంది కొక్కు అప్పనంగా దొరికిన …ఎదుటి వాడి వడ్డు తినేసి తిరిగి వాడికే పంట ఎలా పండించాలో నీతులు చెప్పింది అంట…..బావుంది GA…..ఇంతకీ భోజనాలు పెట్టారా GA….😂😂
హరీష్ శంకర్‌ను, నువ్వు ఇంకోసారి Great ఆంధ్ర murthy గాడి ని de0గాలి
Harish shankar fobia vachindi GA ki😀
మహర్షి గారూ మీరు చాలా యూనీక్ గా వ్రాస్తారు.. ముందుముందు అర్ధవంతంగా కూడా వ్రాయండి..
All The Best!!
మహర్షి గారూ Mee special article kosam waiting sir!
కోపతాపాలు మనసులోంచి కాకుండా పెన్నులోంచి వస్తే మహర్షి అని ఈ మధ్య నిర్వచనం మార్చారా?
On a different note
ఇప్పుడు డైరెక్టయిర్స్ కి రెక్కలు కాదు అన్ని భాషల సినిమాల యాక్సిస్ ఉండాలి. ముక్క ముక్క కలిపి కుట్టె దర్జీల ముక్క ముక్క కలిపి తెలుగు సినిమా రెక్క విరిచెయ్యాలి. పెద్ద ప్రచారం చెయ్యాలి. ముఖ్యంగా తెలుగు భాషను తకదినతోమ్ చేసి అవార్డు కొట్టెయ్యాలి.
“ఇంత పెద్ద ప్రపంచంలో తెలుగు చాలా చిన్న భాష. తెలుగు సినిమా ఇంకా చిన్నది.’
మన భాషని మనం గౌరవించుకోవడం లో తప్పు లేదు. ఆరాధించడం లో తప్పులేదు. చాలా గొప్పది అని భావించడం లో తప్పు లేదు. కానీ… నిజం మాట్లాడుకుంటే… మనభాష ( in that matter ఏ భాష అయినా సరే) ప్రపంచం లోని సవాలక్ష భాషల్లో ఒకటి. Example చెప్పాలి అంటే… భూమి చాలా పెద్దది… కానీ universe lo సవాలక్ష గ్రహాల్లో… ఒకటి అంతే. విశ్వం లో చాలా చిన్నది అని అర్థం.
మరి ప్రపంచికంలో అత్యధిక జనాభా గల దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుంగు అని తమిళ దశావతారం cinema లో కమల్ చెబుతాడుగా. మరి దానికేతంటారు?
మరి ప్రపంచికంలో అత్యధిక జనాభా గల దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుంగు అని తమిళ దశావతారం cinemax లో కమల్ చెబుతాడుగా. మరి దానికేతంటారు?
దానికి ఏమనాలి సర్. ప్రతి వాడు ఏదో ఒకటి గొప్ప అని అనుకుంటాడు. కానీ సూక్ష్మ దృష్టి తో చూస్తే ఏదీ గొప్ప కాదు ఒక్క స్వధర్మం తప్ప అని నా అభిప్రాయం. స్వధర్మం అంటే ఇక్కడ కులమతాలు కాదు. మన పనిని చిత్తశుద్ధితో.. ఎవడికీ తెలిసి కష్టనష్టాలు కలిగించకుండా… ఎవరినీ బాధించకుండా… నెరవేర్చడం అని నా ఉద్దేశ్యం.
చూస్తోంటే తమరు Voyager-1 ఎక్కి విశ్వపు అంచుల సుదూరతీరాలకు చేరుకున్నట్లున్నారు. అక్కడ కూడా GA చదువుకోవడానికి సరిపడా Jio signals వస్తున్నాయా?
దానికి వోయెజర్ -1 అక్కర్లేదు , శ్మశాన వైరాగ్యం వస్తే చాలు మనకి మనం పిపీలిక౦ ల కనపడతాం
నాది ఎయిర్టెల్ అండి😂
ఒహ్హ్.. అందుకే “గాలి కబురులు “మోసుకొచ్చే సైటుకి వచ్చారా . వెల్! వెల్!
journalist pai nundi digi raledu. andaru corrupt.
Worst website
Maharshi ns vs murthy na rasindi eno vadandi
జి. ఆర్. మహర్షి గారు ఇకనుండి ఈ చిన్న తెలుగుభాష వదిలేసి ఈ యూనివర్స్ లో ఎక్కువ శాతం మంది మాట్లాడే ఆ ఏలియన్స్ భాష వాడండి.
మా తెలుగును మాకు వదిలేయండి.
మీలాంటి చాలా గో. ….ప్ప వాళ్లకు తగినది కాదు మా ఈ చిన్న తెలుగుభాష.
ayya Maharshi garu, first 2 linelu chadavagaane neerasam vachesindi. idi meeru rasinde ayi untaadi ani scroll down chesi chuste nenu anukunnadi nijame.
మహర్షి అన్న పెద్ద మేదావి అనుకుంట…అందుకే మేదావి మాటలు ఎన్ని సార్లు చదివినా నా లాంటి సామాన్యునికి అర్ధం కావట్లేదు