యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్ 1983 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సూదన్ యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.
జూలై 2020లో కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సూదన్‌కు ప్రభుత్వ పరిపాలనలోని వివిధ రంగాలలో సుమారు 37 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు.
ఇటీవల యుపీఎస్‌సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో మనోజ్ సోనీ వ్యక్తిగత కారణం అని చెప్పి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రీతి సూదన్ ఎనిమిది నెలల పాటు యుపీఎస్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.