మెగా సినిమాకీ శ్రీలీలే కావాలి

ఏ హీరోని హీరోయిన్ ఛాయిస్ అడిగినా వినిపించే ఒకే ఒక పేరు శ్రీలీల. ఆమె కూడా అడిగిన వాళ్లకు లేదు అనడం లేదు. ఫలనా డేట్ లకే షూటింగ్ అంటే తనేం చేయలేనని, తను…

ఏ హీరోని హీరోయిన్ ఛాయిస్ అడిగినా వినిపించే ఒకే ఒక పేరు శ్రీలీల. ఆమె కూడా అడిగిన వాళ్లకు లేదు అనడం లేదు. ఫలనా డేట్ లకే షూటింగ్ అంటే తనేం చేయలేనని, తను ఇచ్చినపుడు డేట్ లు అడ్జస్ట్ చేసుకుని షూట్ అంటే ఓకె అని క్లారిటీగా చెప్పేస్తోంది. దానికే ఊ అంటూ ఒప్పుకుంటున్నారు.

లేటెస్ట్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా శ్రీలీల పేరు పరిశీలిస్తున్నారు. అయితే మెగాస్టార్ సరసన నటించేందుకు కాదు. అదే సినిమాలో నటించే యువ హీరో సరసన నటించడం కోసం. 

మెగాస్టార్ ఇప్పుడు సోలో సినిమాలు చేయడం లేదు. ఎవరో ఒక యువ హీరో తోడు తీసుకుంటున్నారు. ఈసారి సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు. అయితే సిద్దూ పక్కన హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకోవాలన్నది ప్లాన్.

ఆమె ఒప్పకోవడం సమస్య కాదు. ఒప్పుకున్న తరువాత డేట్ లు సమస్య. ఈ సినిమాకు నిర్మాత మెగాస్టార్ చిరంజీవి కుమార్తెనే. కథ బెజవాడ ప్రసన్న. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ మధ్యనే ఆఫీస్ ఓపెన్ చేసి పనులు అవీ మొదలుపెట్టారు. భోళాశంకర్ తరువాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఇదే.