రీసెంట్ గా రెండో సంతానంపై స్పందించింది రామ్ చరణ్ భార్య ఉపాసన కొణెదల. ఇప్పటికే ఈ దంపతులకు ఓ పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తను మరోసారి గర్భం దాల్చడానికి రెడీగా ఉన్నానని, రెండోసారి తల్లి అవ్వడానికి సిద్ధమని ఉపాసన ప్రకటించింది. అయితే ఇది తన అభిప్రాయం మాత్రమేనని, చరణ్ తో కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయం కాదని కూడా స్పష్టం చేసింది.
ఉపాసన ప్రకటన ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే, పెళ్లయిన తర్వాత బిడ్డకు జన్మనివ్వడానికి లాంగ్ గ్యాప్ తీసుకున్నారు చరణ్-ఉపాసన దంపతులు. క్లీంకార పుట్టిన తర్వాత మళ్లీ అలాంటి లాంగ్ గ్యాప్ తీసుకుంటారేమో అనే భయం అటు చిరంజీవి-సురేఖతో పాటు, ఇటు మెగా ఫ్యాన్స్ లో కూడా ఉంది.
ఇలాంటి సమయంలో ఉపాసన ఇచ్చిన స్టేట్ మెంట్ అందరికీ ఆనందం కలిగించేదే. అయితే ఈసారి తమకు జూనియర్ రామ్ చరణ్ కావాలని అంటున్నారు మెగా ఫ్యాన్స్. తమకు మెగా వారసుడితో పాటు, నట వారసుడు కావాలని వాళ్లు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ అందరికీ నట వారసులున్నారని.. కాబట్టి చరణ్ కూడా నటవారసుడ్ని కనాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ మొత్తం చర్చలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సైలెంట్ అయ్యారు.