ఆలికి కోక కొనడం ఊరికి ఉపకారమా అని సామెత వుండనే వుంది. కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం కాదు. సెలబ్రిటీ స్టేటస్ లో వున్నవారు ఏం చేసినా వార్తే.
మెగాస్టార్ చిరంజీవికి తన కుటుంబ సభ్యలు అంటే చాలా ఇష్టం. గతంలో ఇద్దరి చెల్లెళ్ళ కు కోకాపేటలో కొన్ని ఎకరాల వంతున గిఫ్ట్ ఇచ్చారు. అందులో చిన్న కూతురు శ్రీజ అంటే మరీనూ. అందుకే ఈ మధ్యన ఆమెకు ఓ మాంచి ఇల్లు కొని ఇచ్చారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే కాలనీలో అమ్మకానికి వచ్చిన ఈ ఇల్లు విలువ 35 కోట్లకు పైగానే వుందని తెలుస్తోంది. సిటీలోని ఓ కన్సెన్షన్ సెంటర్ యజమాని తన ఇల్లు అమ్ముతుంటే చిరు కొని కూతురుకు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి మెగాస్టార్ లెవెల్ కు 35 కోట్ల ఇల్లు కొనడం పెద్దగా కష్టమైన పని కాదు. అయితే చేస్తున్న సినిమాలు కొంతయినా పిల్లలకు ఉపయోగపడాలనే ఆలోచన దీని వెనుక వున్నట్లు తెలుస్తోంది.
అనిల్ సుంకర, మైత్రీ మూవీస్ ల దగ్గర చేస్తున్న, చేయబోతున్న సినిమాలకు సంబంధించి కొంత అడ్వాన్స్ లు తీసుకుని ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు భోగట్టా. మొత్తానికి వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్ పారితోషికాలు అలా ఉపయోగపడ్డాయన్న మాట.