ఎన్వీప్రసాద్ నిర్మించే లూసిఫర్ రీమేక్ ప్రారంభోత్సవం ఆగస్టు నెలలొనే. మోహన్ రాజా దర్శకత్వం వహించే ఈ సినిమా రామ్ చరణ్ కు ఇష్టమైన ప్రాజెక్ట్.
అతగాడే మలయాళ సినిమా లూసిఫర్ చూసి ఇష్టపడి మరీ హక్కులు కొనిపించాడు. ఈ సినిమా మూల కథకు మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు సరిపడే విధంగా మార్పులు చేర్పులు చేసి, స్క్రిప్ట్ రెడీ చేసారు.
ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కింగ్ మేకర్ అనీ అది అనీ, ఇది అనీ వినిపించాయి. కానీ ఫైనల్ గా గాడ్ ఫాదర్ అనే టైటిల్ కే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఫిక్స్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
లూసిఫర్ రీమేక్ కథ మీద చాలా కసరత్తు చేసారు. అందులో భాగంగానే చాలా మంది చేయి చేసుకున్నారు. అది సెట్ చేయలేకనే దర్శకుడు వివి వినాయక్ పక్కకు తప్పుకున్నారు. ఆఖరికి మోహన్ రాజా ఫిక్స్ అయ్యారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.