కేంద్రం చెప్పిన పాయింట్ రాష్ట్రానికీ…?

విశాఖ ఉక్కు కు సంబంధించిన వాజ్యం పై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కొన్ని ధర్మ సందేహాలాను రేకెత్తించింది. 'దేశ ఆర్థిక అవసరాలకు సంబంధించిన నిర్ణయాలపై విచారణ తగదు' ఇదీ ఒక పాయింట్.…

విశాఖ ఉక్కు కు సంబంధించిన వాజ్యం పై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కొన్ని ధర్మ సందేహాలాను రేకెత్తించింది. 'దేశ ఆర్థిక అవసరాలకు సంబంధించిన నిర్ణయాలపై విచారణ తగదు' ఇదీ ఒక పాయింట్.

మరి రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల గురించి ఏమనాలి? కేంద్రానికి దేశం అవసరాలు ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి రాష్ట్రం అవసరాలు అంతే ముఖ్యం కదా? 

కేంద్రంలో ఆస్తులు విక్రయిస్తే ఒకలా… తెలంగాణలో అక్కడి ప్రభుత్వం భూములు విక్రయిస్తే మరోలా..ఆంధ్రలో ఆస్తులు విక్రయిస్తే ఇంకోలా? అన్నది సరి కాదు కదా…అన్నింటా ఒకే విధానం,. ఒకటెే ఆలోచన అనేది వుండాలి కదా? 

అలాగే జేడీ లక్ష్మీనారాయణ ను రాజకీయ నాయకుడిగా, రాజకీయ లబ్ది కోసం వేసిన పిటిషన్ గా కేంద్రం పేర్కొంది. మరి ఆంధ్రలో వేసిన అనేకానేక పిటిషన్లు రాజకీయ నాయకులు వేసినవేగా? మరి వాటి మాటేమిటి? 

కేంద్రం దాఖలు చేసిన మాదిరి అఫిడవిట్ లేదా కౌంటర్ నే రాష్ట్రం కూడా భవిష్యత్ లో ఫాలో అయితే లీగల్ గా స్టాండ్ గట్టిగా వుంటుందేమో?